Sun Shine OTT: సన్ షైన్ ఓటీటీకి టిఎఫ్‌సిసి సహకారం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TFCC Helping Sun Shine OTT: మలేసియాలో ఎస్టాబ్లిష్ అయిన సన్ షైన్ ఓటీటీ ని ఇండియాలోని తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ప్రారంభించబోతున్నామని సీయండీ బొల్లు నాగ శివ ప్రసాద్ చౌదరి తెలిపారు. ఈ సంస్థ లోగోను సోమవారం ఎఫ్.ఎన్.సి.సి.లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ చౌదరి మాట్లాడుతూ, ”లాక్ డౌన్ టైమ్ లో ఓటీటీ సంస్థలు ప్రారంభమై పబ్లిక్ లోకి విపరీతంగా చొచ్చుకెళ్లాయి. దీనిపై నేను రెండేళ్ల పాటు రీసెర్చ్ చేసి సన్ షైన్ ఓటీటీ సంస్థను ప్రారంభించాను. ప్రస్తుతం ఇండియాలో టి.యఫ్.సి.సి. వారి సహకారంతో దీనిని ప్రారంభించబోతున్నాం. అన్ని భాషల చిత్రాలు మా ఓటీటీ ద్వారా రిలీజ్ చేయనున్నాం. ఇప్పటికే వెయ్యికి పైగా చిత్రాల బ్యాంక్ ఉంది. అలాగే ఒరిజినల్ కంటెంట్ కూడా ఉంది. న్యూ జనరేషన్ ని ఎంకరేజ్ చేయడానికి షార్ట్ ఫిలిం కాంటెస్ట్ కూడా పెట్టనున్నాం. ప్రతి ఏజ్ గ్రూప్ కి నచ్చే విధమైన కంటెంట్ మా ఓటీటీలో పొందుపరచాలని అన్నది మా లక్ష్యం. త్వరలో మా ఓటీటీ సంస్థని గ్రాండ్ గా లాంచ్ చేయనున్నాం” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, ”నిర్మాతకు తన సినిమాను ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి అమ్మాలనే విషయంలో స్వేచ్ఛ ఉండాలి. ఏ సంస్థో, ఏ అసోసియేషనో నిర్మాతపై ఒత్తిడి తేవడం కరెక్ట్ కాదు. డబ్బులు ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడే ఇచ్చుకునే అవకాశం నిర్మాతకు ఉండాలి. తెలుగు సినిమా రంగంలో కొందరు థియేటర్స్ ఇవ్వకుండా, ఓటీటీలో సినిమాలను అమ్ముకోకుండా అడ్డుకుంటున్నారు. ఇది ఎంత మాత్రం హర్షణీయం కాదు” అని అన్నారు. టీ.ఎఫ్.సి.సి. వైస్ ప్రెసిడెంట్ ఎ. గురురాజ్, నిర్మాత తరుణి రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also Read
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
- Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
తాజావార్తలు
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
-
Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!