తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలు పూర్తి అయినా, 'దిల్' రాజు, సి. కళ్యాణ్ మధ్య కోల్డ్ వార్ కు ఫుల్ స్టాప్ పడినట్టు కనిపించడం లేదు... వీరిద్దరి సినిమాలు వచ్చే నెల 3వ తేదీ బాక్సాఫీస్ బరిలో పోటీకి దిగుతున్నాయి.
వెనుక దన్నుగా స్టార్ ఫ్యామిలీ లేదు. ముందు మూటలకొద్ది ధనమూ లేదు. కేవలం తనను తాను నమ్ముకొని చిత్రసీమలో అడుగు పెట్టిన నాని, ఇప్పుడు నవతరం కథానాయకుల్లో తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు.
పిన్నవయసులోనే కన్నుమూసిన హీరో తారకరత్న గురించి, ఇప్పుడు నందమూరి అభిమానులు విశేషంగా చర్చించుకుంటున్నారు. నిజానికి తారకరత్న కెరీర్ లో ఒక్కటంటే ఒక్క సాలిడ్ హిట్ లేకపోయినప్పటికీ, నందమూరి ఫ్యాన్స్ కు ఆయనంటే అంత అభిమానం!
ఒకప్పుడు నాజూకు షోకులతో కుర్రకారును కిర్రెక్కించిన ఇలియానా డి'క్రుజ్ ఇప్పుడు ముద్దుగా బొద్దుగా తయారయింది. తెలుగు సినిమాలతోనే ఓ వెలుగు వెలిగిన ఇలియానా ఉత్తరాదికి ఉరకలు వేసి, దక్షిణాదిపై - ముఖ్యంగా తనకు స్టార్ డమ్ సంపాదించి పెట్టిన టాలీవుడ్ పై కామెంట్స్ చేసింది.
అలనాటి శృంగార తార జయమాలినిని ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. పోలీస్ అధికారి పార్తీబన్ తో వివాహానంతరం ఆమె నటనకు దూరమైంది. రేపు వారి కుమారుడు శ్యామ్ హరి వివాహం చెన్నయ్ లో జరుగబోతోంది.
'సీతారామం', 'సార్' చిత్రాలలో సుమంత్ పోషించిన పాత్రలు అతనికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. సోలో హీరోగా పెద్దంత విజయాలను అందుకోలేకపోతున్న సుమంత్ ఇక మీదట ఇదే పంథాలో సాగితే బెటర్!!
యువ నటులు కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశి హీరోహీరోయిన్లు రాబోతున్న రొమాంటిక్ డ్రామా వినరో భాగ్యము విష్ణు కథ. ఈ చిత్రం దాని సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది.
టాలీవుడ్లో రీరిలీజ్ ట్రెండ్ ఇప్పట్లో ఆగేలా లేదు. సందర్భాలతో సంబంధం లేకుండా ఎక్కువ సినిమాలు రీ-రిలీజ్ అవుతున్నాయి. పాత చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను చూపుతూ కొత్త సినిమాల కంటే కూడా కొన్ని సినిమాలు వసూళ్లు చేస్తున్నాయి.