SurekaVani : టాలీవుడ్ నటి సురేఖా వాణి తన నటించిన చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. నేడు తన 42వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, అనుచరులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా సురేఖావాణి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన పుట్టినరోజు వేడుకల సందర్బంగా నుండి కొన్ని చిత్రాలను పంచుకుంది. ఈ ఫోటోల్లో సురేఖ వాణి తన కుమార్తె సుప్రీత, ఆమె భర్త ఫోటోతో కనిపించింది. ఆమె తన కుమార్తెకు కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగ పోస్ట్‌ను రాసింది. “నా కుటుంబమే నా బలం. కన్న @_supritha_9, ఒడిదుడుకుల సమయంలో నాతో ఉన్నందుకు ధన్యవాదాలు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను ఎప్పటిలాగే మీ నాన్నను మిస్ అవుతున్నాను. మేము మరింత శక్తితో తిరిగి పుంజుకుంటాము.”