ఎనిమిది వారాల్లోగా ఢిల్లీ-ఎన్సీఆర్లోని అన్ని వీధి కుక్కలను ఆశ్రయాలకు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని నటి సదా తీవ్రంగా వ్యతిరేకించారు. రేబిస్ వల్ల ఒక బాలిక మరణించిన సంఘటన ఆధారంగా ఈ తీర్పు వెలువడింది. సదా ఈ నిర్ణయాన్ని “కుక్కల ఊచకోత”గా అభివర్ణించారు. “ప్రభుత్వం, స్థానిక సంస్థలు లక్షల కుక్కలకు ఆశ్రయాలు, టీకాలు వేయలేకపోవడం వారి అసమర్థత” అని ఆమె ఆరోపించారు. ABC (జంతు జనన నియంత్రణ) కార్యక్రమం సరిగ్గా అమలై ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని…
తెలుగు సినీ పరిశ్రమలోని వేతన పెంపు సమస్యల పరిష్కారం కోసం ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్, మరియు నిర్మాతల మధ్య ముఖ్యమైన చర్చలు మొదలయ్యాయి. ఈ సమావేశం పరిశ్రమలో సాంకేతిక, ఆర్థిక, నిర్మాణ సమస్యలపై దృష్టి సారించింది. ఈ చర్చల్లో ఫెడరేషన్ కోఆర్డినేషన్ ఛైర్మెన్ వీరశంకర్, ఫెడరేషన్ యూనియన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు, ట్రెజరర్ అలెక్స్, ఫైటర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బాజీ, మహిళా ప్రొడక్షన్ నాయకురాలు లలిత…
Tollywood Hero : టాలీవుడ్ లో హీరోలు ఇప్పుడంటే రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు గానీ.. అప్పట్లో అయితే ఒకే ఏడాది పదుల కొద్దీ సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్లు అందుకునేవారు. ఇప్పుడు మహా అయితే 50 సినిమాల్లో కూడా మన స్టార్ హీరోలు నటిస్తారో లేదో చెప్పలేం. కానీ 1980 ప్రాంతంలోని స్టార్లు మాత్రం వందలాది సినిమాల్లో నటించారు. అయితే తెలుగులో ఎక్కువ మంది హీరోయిన్లతో నటించిన హీరో ఎవరో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అందరికీ ఉంటుంది.…
60 ప్లస్ లో హీరోలు ఏం చేస్తారు. మహా అయితే తండ్రి, క్యారెక్టర్ ఆర్టిస్టుగానో స్థిరపడిపోవాల్సిందే. అది ఒకప్పటి మాట. కానీ ఇప్పటి సీనియర్ హీరోలు జూనియర్లకు సరికొత్త లెసన్స్ నేర్పిస్తున్నారు. వంద కోట్లు కొట్టడమే గొప్ప ఎచీవ్ మెంట్ అనుకుంటున్న సౌత్ ఇండస్ట్రీలో నయా రికార్డులు సృష్టిస్తున్నారు. 70 ప్లస్ లో రజనీ, కమల్ లాంటి కోలీవుడ్ స్టార్ హీరోలు రూ. 500 క్రోర్ కలెక్షన్లను చూపించి హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు. Also Read : Coolie…
దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకావాల్సి ఉంది.. అయితే, పోలీసుల విచారణకు ఆర్జీవీ వస్తాడా? రాడా? అనేది ఉత్కంఠగా మారింది.. కాగా, వ్యూహం సినిమా రిలీజ్ సమయంలో సోషల్ మీడియా వేదికగా ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గత ఏడాది నవంబర్ లో మద్దిపాడు పీఎస్ లో వర్మ పై…
నాని హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ది పారడైజ్. గతంలో దసరా అనే సినిమా చేసిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోతోనే ఒక్కసారిగా కలకలం రేపింది. ఎవరూ ఊహించని పాత్రలో నాని కనిపించబోతున్నాడని అనౌన్స్మెంట్ వీడియోతోనే క్లారిటీ చేశారు. ఇక ఇప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్ క్లోజింగ్ వీడియో అంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఆ వీడియో చూస్తుంటే ఒక భారీ జైల్ సీక్వెన్స్ ఫైట్…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహనం నిధి అగర్వాల్ పర్యటనకు వినియోగించారంటూ మీడియాలో వస్తున్న కథనాలకు ఆమె తన సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక లేఖను ఆమె విడుదల చేశారు. తాను ఇటీవల భీమవరంలో ఒక స్టోర్ లాంచ్ ఈవెంట్‌కి వెళ్లానని, అక్కడ తన కారు గురించి అనేక ప్రచారాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఆ ఈవెంట్‌కి హాజరైన సమయంలో అక్కడి లోకల్ ఆర్గనైజర్లే తనకు ట్రాన్స్‌పోర్టేషన్ కల్పించారని చెప్పుకొచ్చింది.…
ఏ క్షణం ఏం జరుగుతుందో వూహించలేకుండా.. ఎవరి రాత ఎలా మారిపోతుందో అంచనాలకు అందకుండా.. ప్రతి నిమిషం ఉత్కంఠగా సాగే షో ఏదైనా ఉందంటే అది “బిగ్ బాస్”. తెలుగు ప్రేక్షకులకు స్టార్ మా అందిస్తున్న ఈ షోలో ఇప్పుడు తొమ్మిదో సీజన్ (బిగ్ బాస్ సీజన్ 9) ఎన్నో ప్రత్యేకతలతో సిద్ధమవుతోంది. ఇన్ని సీజోన్లుగా బిగ్ బాస్‌ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఇవ్వాలనుకుంటున్న ‘రిటర్న్ గిఫ్ట్’తో హోస్ట్ నాగార్జున చేసిన ప్రోమో పెద్ద సంచలనమే సృష్టించింది. Also…
టాలీవుడ్ లో ప్రస్తుతం నెలకొన్న సమ్మె పరిస్థితుల నేపథ్యంలో రైజింగ్ ప్రొడ్యూసర్స్ చిత్ర నిర్మాణంలో తాము ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈ ప్రెస్ మీట్ లో నిర్మాతలు ఎస్ కేఎన్, ధీరజ్, రాజేశ్ దండ, ప్రైమ్ షో చైతన్య, ఛాయ్ బిస్కెట్ శరత్, అనురాగ్, మధుర శ్రీధర్, మహేశ్వర్ రెడ్డి, రాకేష్ వర్రె, తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత ఎస్ కేఎన్…
తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ తన తొలి తెలుగు చిత్రం గేమ్ ఛేంజర్‌తో 2025లో బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూశారు. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. నిజానికి ఇదే ఏడాది శంకర్ కూతురు అదితి శంకర్ కూడా భైరవం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన పల్లెటూరి అమ్మాయిగా నటించిన ఆమె, ఈ చిత్రంలో తన నటనతో మెప్పించినప్పటికీ, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం…