కలర్ ఫోటో మూవీ తో తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాలతో హిట్స్ సాధిస్తోన్న వర్సటైల్ యాక్టర్ సుహాస్, నెక్స్ట్ మూవీ హే భగవాన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శివాని నగరం హీరోయిన్ గా, వెన్నెల కిషోర్, సుదర్శన్ లతోబాటు నరేష్ విజయకృష్ణ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రం టైటిల్ గ్లిమ్స్ సుహాస్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. హీరో సుహాస్ న్యూ లుక్ చాలా సర్ప్రైజింగ్ గా ఉంది.
Also Read : Tollywood : టాలీవుడ్ కు పూర్తిగా దూరమయిన స్టార్ దర్శకుడి డాటర్
విజయ్ సేతుపతి, నిత్యామీనన్ నటించిన తలైవన్ తలైవి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. జస్ట్ రూ. 25 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా రూ. 75 కోట్లను వసూలు చేసిందని రీసెంట్లీ ప్రకటించింది టీం. మక్కల్ సెల్వన్ ఫిల్మోగ్రఫీలో మహారాజా తర్వాత హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది తలైవన్ తలైవి. కాగా, విజయ్ సేతుపతి ఇప్పుడు వెబ్ సిరిస్ ప్లాన్ చేస్తున్నాడు. కడైసి వివసాయి ఫేం ఎం మణికందన్ దర్శకుడు. మత్తు ఎంగిరా కట్టన్ టైటిల్ ఫిక్స్ కాగా విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సిరీస్ తెరకెక్కించబోతున్నారు. డిస్నీ హాట్ స్టార్‌లో తర్వలో స్ట్రీమింగ్ కానుంది.
Also Read : Thama Teaser : ఆయుష్మాన్ ‘థామా’ టీజర్.. రష్మిక రెచ్చిపోయిందిగా..
1962 ఇండో- చైనా యుద్దం ఆధారంగా తెరకెక్కుతోన్న బాలీవుడ్ ఫిల్మ్ 120 బహదూర్. ఈ ‘రిజంగ్ లా’ వార్‌లో 120 మందితో కూడిన ఇండియన్ ఆర్మీ … 3 వేల మంది చైనా ఆర్మీతో వీరోచిత పోరాటం చేసి విజయం సాధించింది. ఇప్పుడు ఇదే కథను తెరపైకి తెస్తోంది బాలీవుడ్. భారత్ తరుఫున నాయకత్వం వహించిన మేజర్ షైతాన్ సింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు ఫర్హాన్ అక్తర్. నవంబర్ 21న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది 120 బహదూర్. 1962లో ఇదే రోజున ఈ యుద్దం ముగిసింది.