భారతీయ సినీ పరిశ్రమకు హైదరాబాదు కేంద్ర బిందువుగా మారాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. సినీ రంగ అభివృద్ధికి అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ చిత్రం ఎంత పెద్ద ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో, అప్పట్లోనే సినిమాకి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. అన్నట్టుగానే, ప్రస్తుతానికి అఖండ 2 సినిమాకి సంబంధించిన సీక్వెల్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాని సెప్టెంబర్ 25వ తేదీన దసరా సందర్భంగా రిలీజ్ చేయాలని ముందు భావించారు.…
కిరణ్ అబ్బవరం, మినిమం గ్యారంటీ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తూ, క సినిమాతో హిట్ అందుకుని, కొంతవరకు మినిమం గ్యారంటీ హీరో అనిపించుకున్నాడు. ఈ సినిమా తర్వాత, తన ఎంపికల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే, ఇప్పటికే ‘కే రాంప్’ అనే ఒక సినిమాతో పాటు, ‘చెన్నై లవ్ స్టోరీ’ అనే మరో సినిమాని పట్టాలెక్కించాడు. ఇక, ఇప్పుడు కిరణ్ అబ్బవరం మరో ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అదేంటంటే, కిరణ్ అబ్బవరం…
ఇటీవల అనారోగ్య కారణాలతో కన్నుమూసిన కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణి, ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ నివాసంలో కన్నుమూశారు. నిజానికి, కోట శ్రీనివాసరావు ఉన్నప్పటి నుంచే ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. చాలా కాలం నుంచే రుక్మిణి అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇక, ఈ రోజు తెల్లవారుజామున ఆమె మరణించినట్లు సమాచారం. Also Read:Harinya Reddy: బిగ్ బాస్ కీలక టీం మెంబర్, ప్రొడ్యూసర్.. రాహుల్ చేసుకోబోయే అమ్మాయి షాకింగ్ బ్యాక్ గ్రౌండ్ ఇక, కొద్దిసేపటి క్రితమే…
Tollywood: టాలీవుడ్లో సినీ కార్మికుల సమ్మె 15వ రోజుకు చేరుకుంది. షూటింగ్స్ పూర్తిగా ఆగిపోవడంతో సగటు కార్మికులు విలవిలలాడుతున్నారు. నిర్మాతలతో చర్చలు ఫలితమివ్వకపోవడంతో ఫెడరేషన్ నాయకులు ఒక పక్క చర్చలు కొనసాగిస్తూనే మరోపక్క నిరసనలకు దిగుతున్నారు. ఈ సమస్యల నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఫెడరేషన్ నాయకులు మెగాస్టార్ చిరంజీవిని కలవనున్నారు. అంతకు ముందు మధ్యాహ్నం 11 గంటలకు ఫెడరేషన్ కార్యాలయంలో కార్మిక సంఘాల సమావేశం జరగనుంది. నిన్న నిర్మాత సీ.కళ్యాణ్ కార్మిక సంఘాల సమస్యలపై…
ట్యాలెంటెడ్ హీరో డాలీ ధనంజయ, సప్తమి గౌడ ప్రధాన పాత్రల్లో సుకేష్ నాయక్ దర్శకత్వంలో యార్లగడ్డ లక్ష్మీ శ్రీనివాస్ సమర్పణలో కళ్యాణ్ చక్రవర్తి ధూళిపల్ల నిర్మిస్తున్న హిస్టారికల్ ప్రాజెక్ట్ ‘హలగలి’. ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తోంది. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో చిత్రీకరిస్తున్నారు. గ్రాండ్ గా జరిగిన ప్రెస్ మీట్ లో ఈ సినిమా గ్లింప్స్ ని లాంచ్ చేశారు మేకర్స్. ధనంజయ్ను కమాండింగ్ అవతార్ ప్రజెంట్ చేసిన గ్లింప్స్ గ్రేట్ ఇంపాక్ట్ క్రియేట్…
ప్రముఖ నిర్మాత, ఏకే ఎంటర్ టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఒక కొత్త రియాల్టీ షోకు శ్రీకారం చుట్టారు. సినిమా రంగంలో రాణించాలనుకునే ఔత్సాహికులకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ రియాల్టీ షో ద్వారా కల్పించనున్నారు. మొత్తం 16 సినిమా స్క్రిప్ట్స్, ఆ స్క్రిప్ట్ ను పరిశీలించడానికి 12 మంది జడ్జీలు, సినిమాకు స్క్రిప్ట్ సెలెక్ట్ చేయడం నుంచి ఆర్టిస్టులు, రచయితలు ఇలా 24 విభాగాల్లో పని చేసే టెక్నీషియన్లను మొత్తం 75 రోజుల్లో ఎన్నుకునే విధానాన్ని…
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే సినిమా రూపొందుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ‘ఫౌజీ’ అనేది వర్కింగ్ టైటిల్గా ఉంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ఒక సైనికుడిగా నటిస్తున్నారనే ప్రచారం ఉంది. ఒక లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాని పీరియడ్ సెటప్లో రూపొందిస్తున్నారు. Also Read:Jr NTR: కాలర్ సెంటిమెంట్ తో రెండో దెబ్బ? ఈ సినిమాకి…
జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించిన ‘వార్ 2’ ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మరో ముఖ్య పాత్రలో నటించారు. అయితే, ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also Read:Coolie : అమీర్ ఖాన్, నాగార్జునను డామినేట్ చేసిన చిన్న నటుడు.. అప్పట్లో ఈ…
ఒకప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు పరిస్థితి వేరు. అంతా పరిస్థితులు తారుమారవుతున్నాయి. నిజానికి ఒకానొక సమయంలో సినిమాలు ఎలా ఉన్నా హీరోల అభిమానులు మాత్రం వాటిని భుజాల మీద మోసేవారు. “మా హీరో సినిమా బానే ఉంది. కావాలనే మీరు నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు,” అంటూ సినిమా మీద నెగిటివ్గా మాట్లాడిన వారి మీద విరుచుకుపడేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. సినిమా బాలేదంటే ముందు అభిమానులే ట్రోల్ చేస్తున్నారు. “ఇలాంటి సినిమాలు నుంచి ఏమి ఎక్స్పెక్ట్…