తెలుగు సినీ కార్మికుల సమ్మెపై ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ” నిన్న మూడు గంటల పాటు చిరంజీవి మాతో చర్చించారు.మాకు న్యాయం చేస్తే సడలింపులకు ఒకే అని చెప్పాము. రెండు రోజుల్లో చిరంజీవి సమస్యను పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు. 40 వేల మంది కార్మికులం ప్రభుత్వానికి అండగా ఉంటాం. మా సమస్యలు పరిష్కరించండి.
Also Read : Manchu : మంచి మంచి కథలను లైన్ లో పెడుతున్న మనోజ్
కార్మికులను చిన్న చూపు చూసే నిర్మాతలకు హెచ్చరిక : సినిమా షూటింగ్స్ కి నచ్చిన వారిని పెట్టుకుంటాం అన్నారు. మాకు నైపుణ్యం లేదు అంటున్నారు. మాకు స్కిల్ లేకపోతే ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ఎలా సినిమా వెళ్ళింది. అందుకు కార్మికులే కారణం. కార్మికులు నిర్మాతలు బాగుండాలని కోరుకుంటాం. కార్మికులను చులకనగా చుస్తే ఊరుకోం. మూడు నెలల ముందే మా వేతనాలు పెంచాలని మేము నిర్మాతలను అడిగాము. ఛాంబర్ జూన్ లో మాతో చర్చించారు. కానీ నిర్మాతలు లేబర్ కమిషనర్ వద్దకు వెళ్లారు. మొదట 5 శాతం పెంచుతాం అన్నారు. అందుకు నాలుగు నిబంధనలు పెట్టారు. డాన్సర్స్, ఫైటర్స్ రేషియో రద్దు చేయాలన్నారు. ఆదివారం డబుల్ పెమెంట్ ఇవ్వము అన్నారు. 9 నుండి 9 గంటల వరకు పనిదినాలు అంటున్నారు. కార్మికుల కడుపు కాలితే వాళ్లే వస్తారు అని పది రోజులు షూటింగ్స్ లేకపోతే వారే వస్తారు అని నిర్మాతలు కించపరిచారు.
Also Read : Sensational Combo : కమల్ హాసన్.. రజనీకాంత్ మల్టీస్టారర్.. దర్శకుడు ఎవరంటే
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో సమావేశం నిర్వహించారు మంత్రి గారు కార్మికుల కష్టాలు తెలిసిన వారు మాకు న్యాయం చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో సినిమా రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి కార్మికులకు న్యాయం చేయాలని కోరుతున్నాము. మేము కార్పొరేట్ ఉద్యోగులం, సాఫ్ట్వె ర్ ఉద్యోగులం కాదు, మేము కష్టజీవులం.24 యూనియన్స్ లో 13 యూనియన్స్ లో 10 యూనియన్స్ పెంచుతాం అన్నారు. మూడు యూనియన్స్ కి పెంచడం వీలు కాదన్నారు. ముప్పై శాతం పెంచడం వీలు కాదన్నారు. చిన్న సినిమాలకు మేము పూర్తి సహకారం అందిస్తాం. చిన్న నిర్మాతలకు కార్మికులం అండగా ఉంటాం. చిన్న నిర్మాతలతో సమావేశం అవుతాం. నిర్మాతలకు ఇబ్బందులు లేకుండా కార్మికులు సహకరిస్తాం. 3 ఆదివారాలు సింగిల్ కాల్ షిట్ అంటున్నారు పెళ్ళాం పిల్లలను వదిలేసి ఆదివారం కష్టపడతాము కాబట్టి డబుల్ కాల్ షిట్ ఇవ్వాలని అడుగుతున్నాము. కాల్ షిట్ 12 గంటలు వుంటుంది కానీ కార్మికులు 16 గంటలు కష్ట పడుతున్నారు.నేడు మరోసారి 3 గంటలకు చిరంజీవి తో సమావేశం కాబోతున్నాం. 4 గంటలకి ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల సమావేశం ఉంటుంది’ అని అన్నారు.