గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ నుంచి వస్తున్న పవర్ ప్యాక్డ్ సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’ పై ప్రేక్షకుల్లో అంచనాల తుఫాన్ నడుస్తుంది. 2021లో విడుదలైన ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ అయ్యినప్పటి నుంచే ఈ సీక్వెల్‌పై హైప్ పెరుగుతూనే ఉంది. దర్శకుడు బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ ఇంకో లెవెల్ అన్నది ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు స్పష్టంగా చూపించాయి. ఇక అసలైతే ఈ సినిమా పోయిన వారం రావాల్సింది, కానీ…
‘పెళ్లంటే నూరేళ్ల పంట’ అని పెద్దలు చెబుతుంటారు. కానీ, ఆచరణలో ముఖ్యంగా సినీ సెలబ్రిటీల జీవితంలో ఇది అసాధ్యంగా మారుతోంది. పెళ్లి బంధం ఒకటి, రెండేళ్ల పంటగా మారిపోతున్న సందర్భాలు అనేకం. అయితే, ఇప్పుడు పెళ్లి సంగతి తర్వాత… నిశ్చితార్థం అయిన నెలలకే బ్రేకప్‌లు చెప్పుకోవడం ట్రెండ్‌గా మారింది. నిశ్చితార్థం జరిగి, పెళ్లికి ముందే విడిపోవడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. కొందరు సెలబ్రిటీలు తాము విడిపోతున్నట్లు బహిరంగంగా ప్రకటిస్తుంటే, మరికొందరు సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు…
సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ మూవీపై.. తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు,యావత్ భారతీయ సినీ ప్రేమికులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలు, ఊహకు అందని విజువల్స్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఇటీవల గ్రాండ్‌గా టైటిల్ లాంచ్ చేసుకొని, పాన్ వరల్డ్ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ సినిమా క్రేజ్ అంచెలంచెలుగా పెరుగుతోంది. అయితే, ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభిమానులకి ఈ మూవీ…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, ఆమె బెస్ట్ ఫ్రెండ్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డిల స్నేహం గురించి ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సింగర్ చిన్మయితో పాటు శిల్పా రెడ్డి కూడా సామ్‌కు అత్యంత సన్నిహితురాలు. శిల్పా రెడ్డి జీవితంలోకి వచ్చాక సమంత జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు, చైతన్యతో విడాకుల తర్వాత సామ్‌కు అండగా నిలబడింది శిల్పా రెడ్డే. తన కుటుంబాన్నే సామ్‌కు కుటుంబంగా మార్చి, ఒంటరితనాన్ని దూరం…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్‌తో రెండో పెళ్లి చేసుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది. డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్‌లో సంప్రదాయ పద్ధతిలో జరిగిన వీరి వివాహంపై కొందరు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నప్పటికీ, అంతకంతా సమంతపై విమర్శలు, ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో, ఏ విషయంలోనైనా సూటిగా స్పందించే నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత రంగంలోకి దిగి ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆమె…
Sumalatha Johnny Master: తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జానీ మాస్టర్ భార్య సుమలత ఘన విజయం సాధించారు. 29 ఓట్ల భారీ మెజారిటీతో ఆమె ప్రత్యర్థి జోసెఫ్ ప్రకాశ్ మాస్టర్‌ను ఓడించారు. మొత్తం 510 ఓట్లలో 439 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో సుమలత ఎలాంటి గ్రూప్‌లు, పెద్దల మద్దతు లేకుండా ఒంటరిగా పోటీ చేయడం ప్రత్యేకంగా నిలిచింది. మరోవైపు జోసెఫ్ ప్రకాశ్‌కు సీనియర్, ప్రముఖ డాన్స్ మాస్టర్లు అండగా నిలిచారు. శేఖర్ మాస్టర్,…
UBS: బాక్సాఫీస్ వద్ద వరుసగా పరాజయాలను చవిచూసినప్పటికీ, హీరోయిన్ శ్రీలీల క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ‘ధమాకా’ లాంటి భారీ హిట్ తర్వాత ఆమె నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఆమె చేతిలో మాత్రం పెద్ద ప్రాజెక్టుల ఆఫర్లు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ప్రస్తుతం శ్రీలీల కెరీర్లో అత్యంత కీలకమైన రెండు ప్రాజెక్టులు చర్చనీయాంశంగా మారాయి. అందులో ఒకటి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా, మరొకటి సుధా కొంగర దర్శకత్వంలో రాబోయే ‘పరాశక్తి’. READ ALSO:…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న ‘అఖండ 2’ సినిమా విడుదల ఆలస్యం కావడానికి వెనుక ఉన్న అసలు కారణం, నిర్మాత సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రొడక్షన్ మరియు EROS మధ్య చాలా కాలంగా నలుగుతున్న ఆర్థిక వివాదమే. గతంలో చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలు తీసి, నష్టాలు వచ్చాయని లేదా పెద్ద లాభాలు రాలేదని చెప్పిన నిర్మాణ సంస్థ, ఇప్పుడు బడా ప్రాజెక్టు విడుదల సమయంలో పాత అప్పులు తీర్చకపోవడం వల్లే EROS…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప 2’ (ది రూల్) 2024 డిసెంబర్ 5న విడుదలై బెంచ్‌మార్క్ రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా, పుష్ప 3 (ది ర్యాంపేజ్) కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. ‘పుష్ప 2’ రిలీజై ఏడాది పూర్తయినా, మేకర్స్ నుండి ‘పుష్ప 3′ గురించి ఎలాంటి ప్రస్తావన రాకపోవడం చర్చనీయాంశమైంది.’పుష్ప 2’ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా…
నటి సమంత, జీవితంలో ఎన్ని ఆటుపోట్లు, అడ్డంకులు ఎదురైనా, తన ప్రొఫెషనల్ విషయంలో చాలా క్లారిటీతో వ్యవహరిస్తుంటారు. తాజాగా, ఆమె తీసుకున్న నిర్ణయం గురించి సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. పెళ్లి తర్వాత ఆమె హనీమూన్‌కు వెళ్లకుండా నేరుగా షూటింగ్లో పాల్గొనడంపై కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు ట్రోలింగ్ చేస్తున్నారు. పెళ్లయిన నాలుగో రోజుకే సమంత తిరిగి షూటింగ్లో పాల్గొనడం హాట్ టాపిక్‌గా మారింది. “పెళ్లి పెళ్లే.. యాక్టింగ్ యాక్టింగే” అంటూ ఆమె హనీమూన్ ట్రిప్‌ను…