Ananya Nagalla:మల్లేశం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి నటనను కనబరిచి మార్కులు కొట్టేసింది. ఇక తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో ఒక హీరోయిన్ గా నటించి అందరి దృష్టిలో పడింది.వకీల్ సాబ్ అనన్యకు మంచి బ్రేక్ ఇచ్చింది కానీ, అవకాశాలను మాత్రం అందివ్వలేకపోయింది.
GAMA Awards: దుబాయ్‌లో జరిగే గామా అవార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏడాది దుబాయ్ లో AFM ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ చేసే ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక ఈ ఏడాది గామా తెలుగు మూవీ అవార్డ్స్ 4th ఎడిషన్ కూడా అంగరంగ వైభవంగా జరిగింది.మార్చి 3న దుబాయ్ లోని జబిల్ పార్క్ లో గామా అవార్డ్స్ వేడుకను, గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు గ్రాండ్ గా నిర్వహించారు.
Sharwanand: కుర్ర హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక గత ఏడాది శర్వా పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే. జూన్ 3 న హీరో శర్వానంద్, రక్షితా రెడ్డిల వివాహం జైపూర్ లీలా ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. వీరి వివాహానికి టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. గత కొన్నిరోజులుగా శర్వానంద్ తండ్రి కాబోతున్నాడని, రక్షిత ప్రస్తుతం గర్భవతిఅని చెప్పుకొస్తున్నారు.
Sharathulu Varthisthai చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం షరతులు వర్తిస్తాయి. కుమారస్వామి(అక్షర) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు. ఈ సినిమా మార్చి 15వ తేదీన థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
Sharwanand: టాలీవుడ్ లో వైవిధ్యంగా కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్. ఎంత ఆస్తి ఉన్నా.. తన టాలెంట్ తోనే పైకి రావాలని..థంబ్స్ అప్ యాడ్ లో గెలిచి.. చిరంజీవితో నటించే అవకాశాన్ని అందుకున్నాడు. అనంతరం చిన్నా చితకా పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగాడు. ఇక శర్వా ఏ కథను ఎంచుకున్నా అందులో ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది.
Kalki2898AD: సలార్ సినిమా తరువాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో కల్కి2898AD ఒకటి. మహానటి చిత్రంతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. వైజయంతీ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో లోక నాయకుడు కమల్ హాసన్ విలన్ గా కనిపిస్తుండగా.. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది.
Aishwarya Rai: ఒకప్పుడు హీరోయిన్స్ ఎలా ఉండేవారు.. ముద్దుగా, బొద్దుగా ఉన్నా కూడా అందంగా, కళగా ఉండేవారు. ముక్కు వంకర.. మూతి వంకర అని ట్రోల్ చేసేవాళ్ళు కూడా ఉండేవారు కాదు. ఎందుకు అంటే.. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు కాబట్టి. కానీ, ఇప్పుడు అలా కాదు. ఎంత అందంగా ఉన్నా కూడా ఇంకా అందంగా కనిపించడానికి హీరోయిన్స్ సర్జరీలపై ఆధారపడుతున్నారు. అప్పుడెప్పుడో శ్రీదేవి తన ముక్కుకు సర్జరీ చేయించుకుంది. అప్పట్లో అదో పెద్ద సెన్సేషన్.
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం నటిగా, నిర్మాతగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఒక మనసు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నిహారిక..స్టార్ హీరోయిన్ గా మారుతుంది.అనుకున్నారు కానీ, ఆ సినిమా తరువాత పలు సినిమాలు చేసినా కూడా ఆమెకు ఆశించిన విజయాలు మాత్రం అందలేదు. దీంతో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పి చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది
Janhvi Kapoor: అందాల అతిలోక సుందరి శ్రీదేవి.. తన అందాన్ని మొత్తం కూతుర్లకు ఇచ్చేసి.. ఆమె వెళ్ళిపోయింది. ఇక తల్లి అందాన్ని పుణికిపుచ్చుకున్న కూతుర్లు ఎప్పటికప్పుడు ఆమెను గుర్తుచేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్. ఈ చిన్నదాన్ని హీరోయిన్ గా చూడాలని శ్రీదేవి ఎంతో ఆశపడింది. కానీ, ఆ ముచ్చట తీరకుండానే శ్రీదేవి మృతి చెందింది.
Vijayalakshmi: తమిళ నటి విజయలక్ష్మీ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో కూడా ఆమె మంచి సినిమాల్లోనే నటించింది. ముఖ్యంగా జగపతి బాబు, అర్జున్ సర్జా, వేణు తొట్టెంపూడి నటించిన హనుమాన్ జంక్షన్ సినిమాలో జగపతిబాబు, అర్జున్ చెల్లెలిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.