Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. మయోసైటిస్ వ్యాధి బారి నుంచి ఈ మధ్యనే కోలుకున్న సామ్.. పెండింగ్ ఉన్న తన సినిమాలను కంప్లీట్ చేస్తోంది. ప్రస్తుతం సామ్ నటిస్తున్న చిత్రాల్లో సిటాడెల్ ఒకటి. అమెజాన్ ప్రతిష్టాత్మకంగా ఈ సిరీస్ ను నిర్మిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో పేరు తెచ్చుకున్న రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి సామ్ ఈ సిరీస్ లో కనిపించనుంది. ఈ మధ్యనే ఈ సిరీస్ షూటింగ్ మొదలయ్యింది. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా చేసిన పాత్రను ఇక్కడ సమంత చేస్తోంది. ఇక ఈ చిత్రం కోసం సామ్ ఎన్నో రిస్క్ లు కూడా చేసింది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. త్వరలో ఈ సిరీస్ అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఇక ఈ సినిమా నుంచి పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేశారు కానీ, ఇంకా టీజర్ రిలీజ్ చేయలేదు కదా.. సిటాడెల్ టీజర్ చూశారా అంటారేంటి అని కంగారు పడకండి. నేడు అమెజాన్ ఈ ఏడాది తమ ఓటిటీలో వచ్చే సిరీస్ లను, సినిమాలను అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. దాదాపు 64 కన్నా ఎక్కువే ఉన్న ఈ లిస్ట్ లో అందరి చూపు సమంత సిటాడెల్ మీదనే ఉంది. ఇక తాజాగా సినిమాలను వదిలేసి.. కేవలం అమెజాన్ ఒరిజినల్ సిరీస్ లను రౌండ్ అప్ చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. అందులో సిటాడెల్ కు సంబంధించిన షాట్స్ నే ఎక్కువగా కనిపించాయి. అల్ట్రా స్టైలిష్ స్పై గా సామ్ అదరగొట్టింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్, గన్ పట్టుకొని పోరాడే షాట్స్ అయితే అదిరిపోయాయి. ప్రియాంకను మించి సామ్.. ఎంతో అందంగా కనిపించింది. మరి సిరీస్ ఎలా ఉంటుంది అనేది రిలీజ్ తరువాత చూడాల్సిందే.