శుక్రవారం సాయంత్రం నుండి ‘సీటీమార్’ మూవీ సెప్టెంబర్ 3 న విడుదల కాదని, వాయిదా పడుతుందని ప్రచారం సాగుతోంది. దానిని కన్ ఫామ్ చేస్తూ చిత్ర నిర్మాతలు తాజాగా సెప్టెంబర్ 10న తమ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు నయా పోస్టర్ ను రిలీజ్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూత పడిన థియేటర్లు పూర్తి స్థాయిలో తెరచుకోక పోవడం, ఆంధ్ర ప్రదేశ్ లో ఇంకా యాభై శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు రన్ కావడంతో పాటు… ఇటీవల…
తెలుగు సినిమాకి చెందిన స్టార్ కపుల్ తమ వివాహబంధాన్ని తెగదంపులు చేసుకునే దిశగా పయనిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి నాలుగేళ్ళ క్రితం తమ ఏడేళ్ళ ప్రేమను సాకారం చేసుకుంటూ ఓ ఇంటివారైనా ఆ స్టార్ జంట చాలామందికి స్ఫూర్తిగా నిలిచింది. వీరిద్దరూ తమ కెరీర్లో పీక్ దశలో ఉన్నారు. ఇటీవల తన పేరులోంచి భర్త ఇంటిపేరు తొలిగించటంపై ఆ హీరోయిన్ బాలీవుడ్ మీడియాకు వివరణ కూడా ఇచ్చింది. షూటింగ్ కి గ్యాప్ ఇస్తున్నట్లు చెప్పటంతో ఇకపై తన…
సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లోనే స్పెషల్ మూవీ ‘మోసగాళ్ళకు మోసగాడు’. ఆ సినిమా విడుదలై ఆగస్ట్ 27తో యాభై సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా భీమవరంలోని కృష్ణ- మహేష్ ఫాన్స్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో ‘మోసగాళ్ళకు మోసగాడు’ స్వర్ణోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ”నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా, ఎడిటరుగా, స్టూడియో అధినేతగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా చలనచిత్ర చరిత్ర పుటలలో కృష్ణ చిరస్థాయిగా నిలిచార’ని…
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకి ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఆనంది ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా థియేటర్లలోను అలరిస్తోంది. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. గ్రామీణ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో లైటింగ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ ‘భీమ్లా నాయక్’.. ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగులతో బిజీగా వున్నాడు. ఈ సినిమాల నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. త్వరలోనే పవన్ – హరీష్ శంకర్ సినిమా కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే వీరిద్దరూ కాంబోలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఎప్పటి నుంచో ఒక ఇండస్ట్రీ హిట్…
శ్రీవిష్ణు హీరోగా మేఘా ఆకాష్ హీరోయిన్ గా హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాజ రాజ చోర’. సునయన కీలక పాత్ర పోషించింది. ఆగస్టు 19న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థలపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫస్ట్ వీక్ ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 10…
నిర్మాత ఎంఎస్ రాజు దర్శకునిగా మారిన సంగతి తెలిసిందే. గత ఏడాది ‘డర్టీ హరి’తో దర్శకుడిగా మంచి విజయం అందుకున్న ఎంఎస్ రాజు తన తదుపరి చిత్రాన్ని ‘7 డేస్ 6 నైట్స్’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వింటేజ్ పిక్చర్స్, ఏబీజీ క్రియేషన్స్ పతాకం మీద సుమంత్ అశ్విన్, రజనీకాంత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం కాబోతున్నారు. నటుడుగాను యాక్ట్…
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నాలుగేళ్ల కిందట తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మాదక ద్రవ్యాల రవాణా, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి 12 మంది టాలీవుడ్ సెలబ్రెటీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకు సినీ స్టార్స్ విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపించింది. పూరి జగన్నాథ్ ఆగస్టు 31 ఛార్మి సెప్టెంబర్ 2…
2017 టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన సెలబ్రెటీలకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఛార్మి, రకుల్, రానా, రవితేజ, తరుణ్, పూరీ జగన్నాథ్, నవదీప్, ముమైత్ ఖాన్, నందు, శ్రీనివాస్ ఈడీ విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేశారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకుఈ సినీ స్టార్స్ విచారణను విచారించనున్నారు. ఈ కేసుతో సంబంధం వున్నవారి నుంచి గోర్లు, తల…
‘మా’ ఎన్నికలకు తేదీ ఖరారు అయింది. అక్టోబర్ 10న మా ఎన్నికలు నిర్వహించేందుకు ‘మా’ ఎన్నికల తేదీని క్రమశిక్షణ కమిటీ అధికారిక ప్రకటన చేసింది. కాగా, ఈసారి మా అధ్యక్ష పదవికి పోటీ పెరిగింది. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, హేమ, జీవితా రాజశేఖర్, సీవిఎల్ నరసింహరావు పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఒకరిపై ఒకరు ఆరోపణలతో సాధారణ రాజకీయ ఎన్నికలను తలపించాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పోటీలో ఉన్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలతో ‘మా’…