మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ‘ఉప్పెన’ తో భారీ వసూళ్లను సాధించి ఘన విషయాన్ని అందుకున్నారు. ఉప్పెన సమయంలోనే వైష్ణవ్ తేజ .. క్రిష్ దర్శకత్వంలో ‘కొండపొలం’ సినిమాను కూడా చేశాడు. చాలా తక్కువ టైమ్ లోనే ఈ సినిమా షూటింగ్ ముగిసింది. కరోనా సెకండ్ వేవ్ తో వాయిదా పడ్డ ఈ సినిమా, దసరా కానుకగా అక్టోబర్ 8న విడుదల కాబోతోంది.
అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇంకా ప్రారంభించాక పోవడంతో ‘కొండపొలం’ చిత్రం వాయిదా పడిందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక మరో మెగా హీరో సాయితేజ్ ‘రిపబ్లిక్’ చిత్రం ‘కొండపొలం’కంటే వారం ముందే (అక్టోబర్ 1న) విడుదల అవుతుండగా.. అక్కినేని హీరో అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో అక్టోబర్ 8నే రానున్నాడు. దీంతో కొండపొలం వాయిదా పడిందంటూ ప్రచారం జరుగుతోంది.
అయితే దీనిపై మేకర్స్ స్పందించినట్లు తెలుస్తోంది. ‘కొండపొలం’ అనుకున్న సమయానికే థియేటర్లోకి వస్తుందని.. సినిమాపై జరుగుతున్న అసత్యప్రచారాన్ని తిప్పికొట్టేందుకు త్వరలోనే ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ ఇస్తారని సమాచారం. మొదటి నుంచి అనుకున్న సినిమాలే పోటీలో ఉన్నాయని.. అన్ని అనుకున్నాకే తేదీని ఫైనల్ చేశామని చిత్రయూనిట్ లో ఒకరు తెలిపినట్లు తెలుస్తోంది. ఓ ప్రచార చిత్రాన్ని ఈ వారంలోనే విడుదల చేస్తారని, ఈ వీకెండ్ నుంచి ప్రమోషన్ ప్రారంభిస్తారని సమాచారం.