ఈ ఏడాది ‘క్రాక్’తో హిట్ కొట్డాడు రవితేజ. ఆ ఊపుతో ప్రస్తుతం మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. అందులో ‘ఖిలాడి’ షూటింగ్ పూర్తయింది. ‘రామారావు ఆన్ డ్యూటీ’, నక్కిన త్రినాథరావు సినిమాలు కూడా ఖరారు అయ్యాయి. గత కొంత కాలంగా రవితేజ పారితోషికంపై పలు చర్చలు నడిశాయి. వరుస ప్లాఫ్స్ వస్తున్నా భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నాడనే విమర్శలు ఎదుర్కొన్నాడు రవితేజ. దీని వల్ల కొంత కాలం మేకప్ వేయకుండా ఉండాల్సి వచ్చింది కూడా. అయితే ‘క్రాక్’ సక్సెస్ తో ఒక్కసారిగా సిట్యుయేషన్ మారిపోయింది. సరిగ్గా ఇక్కడే రవితేజ కూడా స్మార్ట్ గా వ్యవహరిస్తున్నాడు. తన పారితోషికం తగ్గించకున్నప్పటికీ తన సరసన యాక్ట్ చేసే హీరోయిన్స్ విషయంలో పట్టువిడుపు ప్రదర్శిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్స్, హీరోయిన్స్ అయితే డేట్స్ ప్రాబ్లమ్ తో పాటు భారీ పే చెక్ ఉంటుంది. అదే కొత్త వాళ్ళయితే నిర్మాతలకు బడ్జెట్ పరంగా భారం ఉండదు. ఇదే సూత్రాన్ని అనుసరిస్తూ ముందుకు సాగుతున్నాడు రవితేజ.
రాబోతున్న ‘ఖిలాడి’ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిని హీరోయిన్స్ గా ఎంపిక చేసుకున్నాడు. వీరు టాలీవుడ్ లో ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే చేసి ఉన్నారు. అలాగే ఆ తర్వాత తెరకెక్కనున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’లో దివ్యాంశ్ కౌశిక్ ను ఎంచుకున్నాడు. ఆమె కూడా గతంలో తెలుగులో ఒకే ఒక మూవీ చేసింది. ఇక లేటెస్ట్ గా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో చేయబోయే సినిమాలో ‘పెళ్ళి సందD’ ఫేమ్ శ్రీలీలను ఎంపిక చేసుకున్నాడట. ఈ హీరోయిన్స్ లో ఎవరికీ హిట్ లేదు. సో పారితోషికం విషయంలో డిమాండ్ ఉండదు. ఇచ్చిన దానితో సరిపెట్టుకుంటారు. అది నిర్మాతలకు భారం కాదు. అలా తన పారితోషికం ఎక్కువ అనిపించినా ఇలా హీరోయిన్స్ పారితోషికాలను తగ్గించి బ్యాలన్స్ చేస్తున్నాడన్నమాట. మరి మిగిలిన స్టార్ హీరోలు కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తే నిర్మాతలకు ఎంతో కొంత కలసి వస్తుంది. అలా కాకుండా అవ్వా కావాలి… బువ్వా కావాలి అనుకుంటే నిర్మాతలకు ఖర్చు తడిసి మోపెడు అవుతుంది.