బాలకృష్ణ, బోయపాటి కలయికలో వస్తున్న మూడో సినిమా ‘అఖండ’. బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమా ఇది. మొదటి రెండు సినిమాలు ‘సింహా’, ‘లెజెండ్’ ఒకదానిని మించి మరోటి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ‘అఖండ’పై ఆడియన్స్ లోనూ భారీ అంచనాలున్నాయి. దానికి తగినట్లే బోయపాటి ఎంతో పట్టుదలతో ‘అఖండ’ను ఎలాగైన హిట్ చేయాలని కంకణం కట్టుకున్నాడట. తాజా సమాచారం ప్రకటారం ఈ సినిమాలో మొత్తం ఎనిమిది ఫైట్స్ ఉంటాయట. అందులో ప్రత్యకంగా ఇంటర్వెల్…
(ఆగస్టు 30న శ్రీకృష్ణాష్టమి) తెలుగునాటనే కాదు యావద్భారతంలోనూ శ్రీకృష్ణ పాత్రలో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు యన్.టి.రామారావు ఖ్యాతి గాంచారు. ఆయన శ్రీకృష్ణ పాత్ర ధరించిన అనేక చిత్రాలు హిందీ, బెంగాలీ, మరాఠీ, ఒరియా భాషల్లోకి అనువాదమై అలరించాయి. ఉత్తరాదిన శ్రీకృష్ణ పాత్రకు అంతకు ముందు పెట్టింది పేరుగా నిలచిన షాహూ మోడక్ ను సైతం యన్టీఆర్ అభినయం మరిపించింది. యన్టీఆర్ తొలిసారి తెరపై శ్రీకృష్ణుని గెటప్ లో కనిపించిన చిత్రం ‘ఇద్దరు పెళ్ళాలు’. 1954లో ఎఫ్. గఫూర్ రూపొందించిన…
‘మహానటి’ సక్సెస్ తర్వాత కీర్తి సురేష్ ఖాతాలో మరో హిట్ లేదు. అటు హీరోలతో నటించిన సినిమాలో పాటు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఆడియన్స్ ను పూర్తిగా నిరాశపరిచాయనే చెప్పాలి. ఒక్క తమిళ ‘సర్కార్’ మాత్రమే పర్వాలేదనిపించింది. మిగిలిన అన్ని సినిమాలు పరాజయం పొందాయి. ప్రస్తుతం కీర్తి నటించిన ‘మరక్కార్, గుడ్ లక్ సఖి, అన్నత్తే’ సినిమాలు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక తమిళ ‘సాని కాయిదం, వాశి’ సినిమాలతో పాటు తెలుగులో ‘సర్కారువారి…
చిత్ర విచిత్రమైన సంఘటనలకు మన సినిమా పరిశ్రమ వేదిక అవుతూ ఉంటుంది. అలాంటి సంఘటనలు తలచుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. తాజాగా అలాంటి యాదృచ్చికమైన విషయాన్ని గుర్తు చేసుకుందాం. ఈ సంఘటనకు కారకులు భూమిక, పూజాహేగ్డే కావటం విశేషం. 2000లో ‘యువకుడు’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింద భూమిక. ఆ తర్వాత ఏడాదే పవన్ కళ్యాణ్ తో ‘ఖుషీ’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవటంతో భూమికకు వెనుదిరిగి చూసుకునే…
ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. మంచి కంటెంట్ దొరికితే భారీ బడ్జెట్ పెట్టడానికి కూడా మన నిర్మాతలు వెనకాడటం లేదు. త్వరలోనే మరో మెగా హీరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘గని’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు వెంకటేష్ తో వరుణ్ తేజ్ ‘ఎఫ్…
టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దూకుడు పెంచారు. డ్రగ్స్ కేసులో లబ్ధిదారుల ఆస్తుల జప్తు దిశగా ఈడీ దర్యాప్తు చేపట్టనుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 3, 4 ప్రకారం ఈసీఐఆర్ నమోదు చేశారు. ఆబ్కారీ కేసుల ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. విదేశీ అక్రమ లావాదేవీలు గుర్తిస్తే ఫెమా కేసులు నమోదు చేసే యోచనలో వున్నారు. డ్రగ్స్ కేసులో 12 మంది సినీ తారలకు నోటిసులను జారీచేసిన సంగతి…
అనీషా దామ, ప్రిన్స్, భావన వజపండల్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ‘పెళ్లికూతురు పార్టీ’. అపర్ణ మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎ. వి. ఆర్. స్వామి నిర్మాత. ఆగస్ట్ 28న ఈ సినిమా ట్రైలర్ను ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో విడుదల చేశారు. పాన్ ఇండియా స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ” ‘పెళ్లి కూతురు పార్టీ’ అని పిలిస్తే.. ఒక్కడేదో…
ఒకే ఒక్క సినిమాతో ప్రభాస్ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు సుజీత్. ‘రన్ రాజా రన్’ తర్వాత దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ అనే సినిమా చేశాడు ప్రభాస్. తెలుగు నాట ప్లాఫ్ అయిన ఈ సినిమా ఉత్తరాదిన మాత్రం చక్కటి విజయాన్ని సాధించింది. అదే ప్రభాస్ కి డైరెక్టర్ సుజీత్ పై విశ్వాసం పెరగటానికి కారణమైంది. అందుకేనేమో ఇప్పుడు సుజీత్ తో మరో సినిమా చేయటానికి రెడీ…
ఆగస్ట్ 28వ తేదీ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 76వ సర్వ సభ్య సమావేశం హైదరాబాద్ లో జరిగింది. ఈ సమావేశం అనంతరం రాబోయే రెండు సంవత్సరాలు (2021-23)కి గానూ కొనసాగబోయే నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఎన్నుకున్నారు. ఇందులో ప్రముఖ పంపిణీదారుడు, ఎగ్జిబిటర్, నిర్మాత సునీల్ నారంగ్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. వైస్ ప్రెసిడెంట్స్ గా బాల గోవింద్ రాజ్ తడ్ల, వి.ఎల్. శ్రీధర్, ఎ. ఇన్నారెడ్డి వ్యవహరించబోతున్నారు. కార్యదర్శిగా కె. అనుపమ్ రెడ్డి, సంయుక్త…
‘పలాస’ దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’.. నిన్న (ఆగస్ట్ 27) విడుదలైన ఈ సినిమాలో క్లైమాక్స్ బాగుందని ప్రేక్షకుల నుంచి టాక్ వచ్చింది. సుధీర్ బాబు అద్భుతంగా నటించేశారు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలలో ఇది బెస్ట్గా అనిపిస్తుందని పలువురు ప్రశంసలు కురిపిస్తోన్నారు. హీరోయిన్ ఆనంది కూడా మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా ఈ సినిమా విశేషాల గూర్చి సుధీర్ బాబు చెప్పుకొచ్చారు. ‘పలాస 1978 చూశాక నాకు…