Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Maa Election 2021 Vishnu Manchu Manifesto Release

మా ఎన్నికలు: మంచు విష్ణు మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు

NTV Telugu Twitter
Published Date :October 7, 2021 , 4:05 pm
By ramakrishna
మా ఎన్నికలు: మంచు విష్ణు మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

‘మా’ అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో మంచు విష్ణు తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. మా భవనాన్ని తన సొంత డబ్బు కడతానని హామీ ఇచ్చారు.. ఇప్పటికే మూడు స్థలాలు చూసామని… భవిష్యత్ అవసరాలు తీర్చేలా మా భవనం కడతామని స్పష్టం చేశారు. తమ మేనిఫెస్టో లో మొదటి ప్రాధాన్యత అవకాశాలైన మా ఆప్ రెడీ చేస్తామని.. జాబ్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక మంచు విష్ణు మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు ఇవే..!!

  1. అవకాశాలు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో వున్న కొంతమంది సభ్యులు సినిమాల్లో నటించుటకు అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. “MAA App” క్రియేట్ చేసి IMDB తరహాలో ప్రతి ఒక్క “మా” సభ్యుల పోర్ట్ ఫోలియో క్రియేట్ చేస్తాం. “MAA App” యాక్సెనులిటీ నిర్మాతలకి, దర్శకులకి, రచయితలకి, మరియు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటి కి వుండేలా చేస్తాం. ‘జాబ్ కమిటీ’ ద్వారా వారందరికీ సినిమాలు, ఓటిటి వంటి వివిధ మాధ్యమాల్లో అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాము.

  1. “మా” భవనం

తెలుగు కళామతల్లి ఆత్మ గౌరవం ఉట్టిపడేలా “మా”లో వున్న ప్రతి సభ్యుడికీ ఉపయోగపడే విధంగా అత్యాధునిక సౌకర్యాలతో “మా” సాంత భవన నిర్మాణం.

  1. సొంత ఇంటి కల

అర్హులైన “మా” సభ్యులకు ప్రభుత్వ సహకారంతో శాశ్వత నివాస గృహ నిర్మాణం.

  1. వైద్య సహాయం

“మా” లో వున్న ప్రతి ఒక్క సభ్యుడికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ సమగ్రమైన ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ (ఆరోగ్య భీమా) అందజేస్తాం. పలు కార్పొరేట్ హాస్పిటల్స్ తో అనుసంధానమై “మా” కుటుంబ సభ్యులందరికీ వైద్యం అందిస్తాం. మూడు నెలలకు ఒకసారి “మా” కుటుంబ సభ్యులందరికీ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి, ఉచిత మెడికల్ టెస్టు చేయిస్తాం. ప్రతి ఒక్క “మా” సభ్యుడికి ఉచితంగా ESI హెల్త్ కార్డు అందిస్తాం. ఇప్పటికే 946 మంది ‘మా’ సభ్యులు (అసోసియేట్ మెంబర్స్ తో సహా) వున్నారు. ప్రస్తుతం ఒక్కొక్కరి పేరిట మూడు లక్షల జీవిత భీమా అమలులో ఉంది. దీనిని గణనీయంగా పెంచుతాము.

  1. చదువుల తల్లి

అర్హులైన “మా” సభ్యుల పిల్లలకు KG to PG వరకు విద్యా సహాయం.

  1. కళ్యాణలక్ష్మి

అర్హులైన “మా” సభ్యులకు “మా” కళ్యాణలక్ష్మి పథకం ద్వారా లక్షా పదహారు వేల ఆర్థిక సహాయం కొనసాగింపబడుతుంది.

  1. మహిళా రక్షణ హై పవర్ కమిటీ (Women Empowerment)

“మా” చరిత్రలో మొట్టమొదటిసారిగా “మా” మహిళా సభ్యుల సంక్షేమం మరియు రక్షణ కోసం హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తాం. వయసుతో సంబంధం లేకుండా అర్హులైన అందరికీ (including single Mother and single Women) ఆర్థిక సహాయం అందజేస్తాం. వారికి “మా” ద్వారా సంపూర్ణ భరోసా ఇస్తాం.

  1. వృద్ధ కళాకారుల సంక్షేమం

మేము ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రస్తుతం పెన్షన్ల కోసం పెట్టుకుని ఉన్న దరఖాస్తులన్నీ పరిశీలించి అర్హులైన వారందరికీ ప్రతి నెలా పెన్షన్లు అందేలా చేస్తాం. అలాగే 6,000/-లు ఉన్న పెన్షన్‌ను గణనీయంగా పెంచుతాం. అంతే కాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ప్రభుత్వపరంగా ఉన్న పెన్షన్ పథకాలు మరియు NBFC లో ఉన్న పథకాలు మన సభ్యులకు కూడా వర్తించేలా చేస్తాం.

  1. ఓటు హక్కు

గౌరవ సభ్యత్వం ఇచ్చిన సీనియర్ సిటిజన్స్ కి ఓటు హక్కు వచ్చేలా AGM లో ఆమోదం తెచ్చుకుని అమలు చేస్తాం.

  1. “మా” మెంబర్షిప్ కార్డ్

కరీనా వల్ల కళాకారులందరూ ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురయ్యారు. కమిటీ ఆమోదంతో ఆర్థికంగా వెనకపడ్డ యువతను ప్రోత్సహించడానికి కొంత కాలపరిమితి వరకు “మా” మెంబర్షిని రూ, డెబ్బై ఐదు వేలకి (75,000/-) తగ్గించి ఇస్తాం.

  1. “మా” ఉత్సవాలు

ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చురుకుగా చేపట్టడానికి ఒక Cultural and Finance Committeeని ఏర్పాటు చేసి, సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడలు నిర్వహించి “మా”ని ఆర్థికంగా బలపరుస్తాం. “మా” నటీనటులందరం కలిసి “మా” ఉత్సవాలను (A Celebration of Telugu Cinema ఒక పండుగలా జరుపుకుందాం.

  1. మోహన్ బాబు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్

“మా” సభ్యుల పిల్లలకు సినిమాల పట్ల అభిరుచి వున్నచో మోహన్ బాబు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ద్వారా 50% స్కాలర్‌షితో శిక్షణ ఇప్పించడమేకాక, పలు పేరొందిన ఫిల్మ్ ఇనిస్టిట్యూట్స్ లో తగినంత డిస్కౌంటు ఇప్పించే ప్రయత్నం చేస్తాం.

  1. ప్రభుత్వాల సహాయసహకారాలు

“మా” ఎన్నికలలో మేము ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెండు రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులని కలుసుకుని వారితో సత్సంబంధాలు నెలకొల్పుకుని మన తెలుగు చలనచిత్ర సమస్యల పరిష్కారాలకి, దాని అభివృద్ధి ప్రణాళికలకు వారి సంపూర్ణ సహాయసహకారాలను అభ్యర్థిస్తాం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • MAA Election 2021: Vishnu Manchu Manifesto
  • MAA Elections 2021
  • Manchu Manifesto Release
  • manchu vishnu
  • Manchu Vishnu Panel

తాజావార్తలు

  • Off The Record : ఆ జిల్లాలో తమ్ముళ్లకు టీడీపీ అధిష్టానం వార్నింగ్

  • Sajjala Ramakrishna Reddy: జూన్ 4న ఏపీవ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’కార్యక్రమం.. సజ్జల కీలక ఆదేశాలు..

  • COVID-19: మీకు కరోనా లక్షణాలు కనిపిస్తే.. ఎక్కడ పరీక్ష చేయించుకోవాలి?

  • Pahalgam: మోడీకి కృతజ్ఞతలు చెప్పిన సింగపూర్ మహిళ.. కారణమిదే!

  • Weather Updates : రేపు, ఎల్లుండి తెలంగాణకు వర్ష సూచన..

ట్రెండింగ్‌

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • Motorola Edge 2025: 50MP ఫ్రంట్ కెమెరా, Dimensity 7400 ప్రాసెసర్‌, హై ఎండ్ ఫీచర్లతో మోటరోలా ఎడ్జ్ 2025 లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions