మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల విషయంలో ఏకాభిప్రాయం ఏర్పడింది. ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకూ జరిగిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో ‘మా’ ఎన్నికలను వీలైనంత త్వరగా జరపాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో దాదాపు 160 మంది సభ్యులు పాల్గొన్నట్టు సమాచారం. ఎన్నికలు అనివార్యం అని చెప్పిన సభ్యులు, దానిని నిర్వహించే తేదీపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారట. సెప్టెంబర్ లో ఎలక్షన్స్ జరపాలని…
మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఇవాళ అభిమానులందరికీ ఫుల్ మీల్స్ దక్కినట్టు అయ్యింది. ‘ఆచార్య’ నయా పోస్టర్ రిలీజ్ దగ్గర నుండి రెండు కొత్త సినిమాల టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు మరో మూవీకి సంబంధించిన పోస్టర్ సైతం విడుదలైపోయింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, బాబీ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న ఈ మూవీకి సంబంధించిన విశేషాలను మాత్రం చెప్పి, చెప్పకుండా దాటేశారు. మొదట తెలిపిన టైమ్ కు కేవలం పోస్టర్ ను మాత్రం విడుదల చేశారు.…
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమా కథలు ఎలా సాగుతాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సున్నితమైన భావోద్వేగాలే ఆయన సినిమాలకు బలం. ఎంత నెమ్మదిగా చెప్పితే అంతా గట్టిగా హృదయాల్లో నిలుస్తాయనడానికి ఆయన సినిమాలే ఉదాహరణలు. అయితే కొన్నిసార్లు ఆ నిడివే సినిమాకు బలహీనతగా కూడా మారుతోంది. నిజానికి శేఖర్ కమ్ముల తన కథకు తగ్గట్టుగా సన్నివేశం ఎంత సమయం తీసుకోవాలనే దానిలో పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తారు. అయితే కాలక్రమములో, ఈ ఇంటర్ నెట్ ప్రపంచంలో ప్రేక్షకుల అభిరుచి…
శనివారం వీకెండ్ కావడంతో మూవీ లవర్స్ తో థియేటర్ల వద్ద సందడిగా కనిపించింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో సినిమాలు అందుబాటులోకి వస్తున్నప్పటికి బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుందని మూవీ ఆడియన్స్ చెప్తున్నారు. పెద్ద సినిమాలు లేకపోయినను.. ఆడుతున్న సినిమాలపై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా, ఈ నెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఎస్.ఆర్. కల్యాణ మండపం’ రెండు వారాల్లో 8.30 కోట్ల షేర్ ను రాబట్టిందని తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం –…
రెండు మూడేళ్లు సీరియల్స్లో, ఆ తర్వాత సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన విజయ్ కనకమేడల ‘నాంది’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైయ్యాడు. ‘అల్లరి’ నరేశ్ హీరోగా, వరలక్ష్మీ శరత్కుమార్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం ఆకట్టుకొంది. నరేష్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాగా మలిచాడు విజయ్ కనకమేడల.. ప్రస్తుతం ఈ దర్శకుడు తన తదుపరి సినిమాని అక్కినేని నాగచైతన్యతో చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదివరకే విజయ్ కనకమేడల నరేట్ చేసిన స్టోరీకి చైతు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు…
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు గత కొన్ని రోజుల నుండి సంబరాలు, సేవాకార్యక్రమాలు జరుపుతుంటే… తాజాగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా ఒకరోజు ముందు నుండే రావడం మొదలైపోయింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తొలిసారి సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ‘లూసిఫర్’ మూవీకి తెలుగు టైటిల్ ను ఖరారు చేశారు. దీనికి ‘గాడ్ ఫాదర్’ అనే పేరు పెట్టారు. రామ్ చరణ్ సమర్పణలో ఆర్. బి. చౌదరితో కలిసి ఎన్వీ…
బ్రేవ్ హార్ట్ పిక్చర్స్ పతాకంపై బాబా పి. ఆర్. దర్శకుడిగా పరిచయమవుతోన్న చిత్రం ‘సైదులు’. అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను శుక్రవారం హీరో శ్రీకాంత్ తన నివాసంలో ఆవిష్కరించారు. అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ… ”టైటిల్ చాలా క్యాచీగా ఉంది. సినిమాకాన్సెప్ట్ కూడా విన్నాను. ఎంతో ఇంట్రస్టింగ్ గా అనిపించింది. ఈ సినిమా విజయం సాధించి యూనిట్ అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు. చిత్ర దర్శకుడు…
మరికొన్ని రోజుల్లో జరగనున్న ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం పోటీపడనున్నారు. కాగా ఇప్పటికే, లోకల్-నాన్ లోకల్, మా నిధులు, మా శాశ్వత భవనం అంటూ ఒకరిపై ఒకరు పోటీదారులు ఆరోపణలు చేసుకోవడంతో వివాదం రోజుకో మలుపుతిరుగుతోంది. తాజాగా మంచు విష్ణు ట్విటర్ ద్వారా వీడియో సందేశం ఇస్తూ.. త్వరలోనే ‘మా’ శాశ్వత భవనం కల నెరవేరనుందని చెప్పుకొచ్చారు. భవనం నిర్మించడం కోసం మూడు స్థలాలు పరిశీలించామని విష్ణు తెలిపారు.…
హాస్య నటుడు సత్య హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వివాహ భోజనంబు’. అర్జావీ రాజ్ కథానాయికగా నటించింది. యువ నటుడు సందీప్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రం ఆగస్టు సోని లివ్ 27న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. లాక్డౌన్ ఇతివృత్తంగా సాగే కథతో వస్తుంది ఈ చిత్రం.. కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి యువకుడి కథ వినోదాత్మకంగా రానుంది. ఆనంది ఆర్ట్స్ సోల్జర్స్ ఫ్యాక్టరీ వెంకటాద్రి టాకీస్ సమర్పణలో…
గత నెలాఖరులో సినిమా థియేటర్లను తెరచిన దగ్గర నుండి స్మాల్, మీడియం బడ్జెట్ చిత్రాలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఇది సినిమాల విడుదలకు అచ్చి వచ్చే సీజన్ ఎంత మాత్రం కాదు. అయినా… సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో పెద్ద సినిమాలు వస్తే… తమకు చోటు దక్కదనే భయంతో చిన్న చిత్రాల నిర్మాతలంతా థియేటర్లకు క్యూ కడుతున్నారు. అలా జూలై చివరి వారం ఐదు సినిమాలు విడుదలైతే… ఈ నెల ప్రథమార్ధంలో ఏకంగా 15 సినిమాలు విడుదలయ్యాయి. ఇంతవరకూ ‘తిమ్మరుసు,…