గతకొన్ని రోజుల నుంచి హైపర్ ఆది అజ్ఞాతంలో ఉన్నాడని, స్టార్ హీరో అభిమానులు ఆయన కోసం వెతుకుతున్నారని వార్తలు వస్తున్నా సంగతి తెలిసిందే.. హైపర్ పంచ్ లతో ఒక్కరిని కూడా వదలకుండా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఆది ఒక స్కిట్ లో ఒక ప్రముఖ హీరోపై సెటైర్లు వేశాడు.ఆ సెటైర్లకు హీరో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు, ఆది ఎక్కడ కనిపిస్తే అక్కడ కొడతాం అని అన్నారని వార్తలు గుప్పుమన్నాయి.
ఇక తాజాగా వీటిపై ఆది తనదైన స్టైల్లో స్పందించాడు. తన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేసిన ఆది ” రెండు రోజులుగా నా గురించి ఎవరెవరో వెతుకుతున్నారని వార్తలు వస్తున్నాయి.. అసలు ఆ ఫేక్ న్యూస్ రాసేవాళ్లు ఎవరు..? భయ్యా.. మీకు డబ్బులు లేకపోతే చెప్పండి.. నేను సంపాదించేవాటిలో కొంచెం తీసి మీకు ఇస్తాను.. మేమందరం హ్యాపీగా షూటింగులు చేసుకుంటున్నాం. అందరూ హ్యాపీగా ఉండండి, మేమూ హ్యాపీగా ఉన్నాం” అని పంచ్ లతో కౌంటర్లు వేశాడు. ఇక ఈ వీడియోతో హైపర్ ఆదిపై ఎలాంటి దాడి జరగలేదని తెలుస్తోంది.