యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజక వర్గం చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎంఎస్ రాజశేఖర్ దరకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఇక ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర కోసం కామెడీ కింగ్ బ్రహ్మానందాన్ని ఎంపిక చేశారు చిత్ర బృందం. పారితోషికం కూడా బాగానే ముట్టజెప్పారట. అయితే బ్రహ్మ్మనందం తీరుపై నితిన్ ఫైర్ అయ్యాడంట.. షూటింగ్ టైం కి బ్రహ్మీ రాలేదని, ఆయన వలన సమయం వృధా అయ్యిందని నితిన్ భావించి ఆయనను సినిమా నుంచి తొలగించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ చిత్రానికి నితినే ప్రొడ్యూసర్ కావడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడట. ఆయన తీరుతో విసిగిపోయిన యంగ్ హీరో ఇచ్చిన రెమ్యూనిరేషన్ గురించి కూడా ఆలోచించకుండా బ్రహ్మీ పాత్రను తొలగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో నిజమెంత ఉందొ తెలియాలంటే చిత్ర బృందం స్పందించాల్సిందే.