చిత్ర పరిశ్రమ అన్నాకా రూమర్స్ సాధారణం.. హీరో హీరోయిన్లు.. డైరెక్టర్ హీరోయిన్లు కొద్దిగా చనువుగా కనిపిస్తే వారిద్దరి మధ్య ఏదో ఉందని గాసిప్స్ రావడం సాధారణమే.. కొంతమంది వీటిని లైట్ గా తీసుకొంటారు.. ఇంకొంతమంది వాటిని క్లారిఫై చేస్తారు. తాజాగా డైరెక్టర్ రవిబాబు తనపై వచ్చిన రూమర్స్ అన్ని అబద్దాలే అని తేల్చి చెప్పారు. గత కొన్నేళ్ల నుంచి రవిబాబు, హీరోయిన్ పూర్ణ మధ్య అఫైర్ ఉందని, అందుకే రవిబాబు ఆమెకు మూడు సినిమాల్లో ఛాన్స్ ఇచ్చాడని వార్తలు గుప్పుమన్నాయి. వరుసగా రవిబాబు దర్శకత్వంలో పూర్ణ అవును, అవును 2, లడ్డుబాబు చిత్రాల్లో నటించింది. ఈ అవకాశాలు రావడానికి రవిబాబుకు ఆమె అంటే ఇష్టమే కారణమని వార్తలు సోషల్ మీడియా లో హల్చల్ చేసాయి.
ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న రవిబాబు ఈ రూమర్స్ కి చెక్ పెట్టారు. హీరోయిన్లకు, తనకు మధ్య ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ” నా షూటింగ్ అయిపోయాక హీరోయిన్ తో మాట్లాడడం కానీ, వారికి ఫోన్ చేయడం కానీ జరగదు.. సినిమా అయిపోయాక వారెవరో.. నీనెవెరో..అన్నట్టుగానే ఉంటాను. నేను ఎథిక్స్, వాల్యూస్ ఎక్కువ నమ్మే వ్యక్తిని.. పూర్ణను కేవలం ఆమె అభినయం చూసే మూడు సినిమాల్లో తీసుకున్నా.. అయినా నేను వారిని వేధించేవాడని అయితే వారు మళ్లీ నాతో సినిమాలు ఎందుకు తీస్తారు” అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ రూమర్స్ కి చెక్ పడినట్లయింది.