సినిమా పరిశ్రమ తప్పు లేకపోయినా తెలుగు చిత్రసీమకే నష్టం కల్గించే సంఘటనలు కొందరి ద్వారా ఇటీవల ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో తామంతా ఆ నటుడు చెబుతున్న అభిప్రాయంలో ఏకీభవించడం లేదని, సినిమా టిక్కెట్ల విషయంలో ఆన్లైన్ విధానంకు మద్దతు ఇస్తున్నామని, తమ ఆర్ధిక ఇబ్బందులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని సినిమా నిర్మాతలు తనను అభ్యర్ధించినట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) తెలిపారు. బుధవారం మచిలీపట్నం లోని…
ఏపీ మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్రాజు చర్చలు ముగిసింది. దిల్ రాజుతో పాటు నిర్మాతలు డీవీవీ దానయ్య, సునీల్ నారంగ్, బన్నీవాసు మరికొందరు కలిసి పేర్ని నానితో చాలా సేపు మంతనాలు జరిపారు. దీనిపై దిల్ రాజు మాట్లాడుతూ.. ‘చిరంజీవి, నాగార్జున, రాజమౌళితో కలిసి గతంలోనే సీఎంను కలిశాము. పరిశ్రమపై కోవిడ్ ప్రభావం.. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాం. వకీల్ సాబ్ సినిమా సమయంలో కొన్ని పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. దయచేసి అందరూ…
ప్రస్తుతం థియేటర్లతో సమానంగానే ఓటీటీలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.. కరోనా వేవ్ తగ్గుముఖం పట్టడంతో థియేటర్లో మునుపటి జోష్ కనిపిస్తోంది. పెద్ద సినిమాలు లేకున్నాను, చిన్న సినిమాలు సైతం భారీ కలెక్షన్స్ రాబట్టుకొంటున్నాయి. ఇక ఈ వారం థియేటర్లోనూ, ఓటీటీలోను విడుదల అవుతున్న సినిమాల లిస్ట్ పై ఓ లుక్కేయండి. సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ అక్టోబర్ 1న విడుదల అవుతుంది. దేవా కట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇటీవలే విడుదలైన…
విక్టరీ వెంకటేష్ రీసెంట్ గా నటించిన ‘నారప్ప’ చిత్రం ఓటీటీలో విడుదల అయినా సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘దృశ్యం 2’ సినిమా కూడా ఓటీటీలోనే విడుదల చేయబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. ‘నారప్ప’ మాదిరిగానే ‘దృశ్యం 2’ సినిమాను కూడా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాలని నిర్మాతల ఆలోచనగా తెలుస్తోందని ప్రచారం జరుగుతోంది. దసరా తర్వాత ‘దృశ్యం 2’ స్ట్రీమ్ కానుందని బలంగానే వినిపిస్తున్న.. చిత్రయూనిట్ మాత్రం ఇంకా సందిగ్ధంలోనే ఉందట. ‘నారప్ప’ సినిమాకు…
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్)… ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల అయినా ప్రచార చిత్రాలు, దోస్తీ పాటకు భారీ రెస్పాన్స్ వచ్చింది. కాగా, ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తుండటంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహాంగా వున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం రెండు రోజుల్లో ఈ చిత్ర విడుదల తేదీని ఖరారు చేయనున్నారని సమాచారం. ఆర్ఆర్ఆర్ చిత్రం వచ్చే ఏడాది…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న జరగనున్న విషయం తెలిసిందే.. అందులో భాగంగా నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఇవాళ్టి నుంచి 29 వరకు నామినేషన్ పత్రాలను స్వీకరిస్తున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి మా ఎన్నికలు హాట్ హాట్ గా రాజకీయ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఇప్పటికే విందులు ఇచ్చి ఓటర్లను మచ్చిక చేసుకునే కార్యక్రమం మొదలుపెట్టగా.. తాజాగా ఓటుకు నోటు అనే టాపిక్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.…
ప్రామిసింగ్ యంగ్ హీరో నాగశౌర్య తాజా చిత్రం ‘లక్ష్య’ విడుదల తేదీ ఖరారైంది. నవంబర్ 12వ తేదీని అతని 20వ చిత్రమైన ‘లక్ష్య’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుకుంటోంది. ఇందులో కేతికా శర్మ కథానాయికగా నటిస్తోంది. సోనాలి నారంగ్ సమర్పణలో నారాయణ దాస్ కె. నారంగ్, పుస్కర్ రామ్మోహన్ రావ్, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిన్న…
(సెప్టెంబర్ 27తో ‘స్టూడెంట్ నం.1’కు 20 ఏళ్ళు) యంగ్ టైగర్ యన్టీఆర్ తొలి ఘనవిజయం, దర్శకధీరుడు రాజమౌళి తొలి సినిమా ‘స్టూడెంట్ నంబర్ వన్’. 2001 సెప్టెంబర్ 27న ‘స్టూడెంట్ నంబర్ వన్’ జనం ముందు నిలచింది.వారి మదిని గెలిచింది. ఆ సినిమా చూసినప్పుడే నందమూరి అభిమానులు ‘మనవాడు మహా గట్టివాడు… స్టార్ హీరో అయిపోయాడు…’ అనుకున్నారు. ‘ఎవరో కొత్త దర్శకుడు రాజమౌళి అట… భలేగా తీశాడు…’ అని ప్రేక్షకులు అన్నారు. వారిద్దరూ రాబోయే కాలంలో అనూహ్య…
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గతంలో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ గ్రౌండ్ లో రక్తచరిత్ర రెండు పార్టులుగా తెరకెక్కించిన విషయం తెలిసిందే.. ఇప్పుడు తెలంగాణ రక్తచరిత్రను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈమేరకు ‘కొండా’ పేరుతో ఓ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు. కాంగ్రెస్ నేతలు కొండా మురళీధర్ రావు, సురేఖ దంపతుల జీవితాన్ని ఆర్జీవీ వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ఆర్కె అలియాస్ రామకృష్ణ పాత్రలు కీలకంగా ఆయన ఈ సినిమాను రూపొందించనున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ వరంగల్ పరిసర…