‘RRR’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. పూనకాల జాతర షూరూ చేసిన జక్కన్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్న సినిమా ‘ట్రిపుల్ ఆర్’. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ రికార్డులను బద్దలు కొడుతున్న సంగతి తెల్సిందే. ఇక తాజాగా అభిమానులందరు పూనకాలతో ఊగిపోయే అప్ డేట్ ని ‘ట్రిపుల్ ఆర్’ బృందం తెలిపింది. ఈ సినిమా ట్రైలర్ ని డిసెంబర్ 3 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
‘బిగ్గెస్ట్ బ్లాస్ట్ కోసం సిద్ధంగా ఉండండి. ప్రశాంతత లేదు.. ఇక సెలబ్రేషన్స్ ప్రారంభించండి’ అని తెలుపుతూ సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. జననీ సాంగ్ లో ఉన్న అందరి లుక్ ని కలగలుపుతూ వారి ఎమోషన్స్ ఎలివేట్ చేస్తూ ఉన్న ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. సంక్రాంతి కానుకగా జనవరి 7 న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తుండగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా సందడి చేయనున్నాడు. చెర్రీకి జోడిగా అలియా కనిపిస్తుండగా, తారక్ కి జోడిగా ఒలియా మోరిస్ నటిస్తోంది.మరి ఈ సినిమాతో ఇంకెన్ని రికార్డులను జక్కన్న బద్దలుకొడతాడో చూడాలి.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
DECEMBER 3rd… RRR Trailer Day… #RRRTrailer #RRRTraileronDec3rd #RRRMovie pic.twitter.com/qAqk7Pi0Ra
— rajamouli ss (@ssrajamouli) November 29, 2021
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!