మెగా డాటర్ నిహారిక పెళ్లి తరువాత సినిమాలకు స్వస్తి చెప్పిన విషయం తెలిసిందే. తన భర్త చైతన్య జొన్నలగడ్డకు నటించడం ఇష్టంలేదని తెలపడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన నిహారిక నిర్మాతగా మారింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో నిహా ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసింది. ఈ బ్యానర్ లోనే “ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ” వెబ్ సిరీస్ ని తెరకెక్కించింది. జీ5 లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సిరీస్ ని వీక్షించిన చిరు మెగా డాటర్ నిహారికకు ప్రశంసలతో ముంచెత్తారు.
“ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చూశాను.. ఎంతో ఎంటర్ టైనింగ్ గా ఉంది.. నిర్మాణంలో తన తోలి ప్రయత్నంలోనే ఇంత హృద్యంగా, వినోదాత్మకంగా తీసి ప్రేక్షకులను మెప్పిస్తున్న మా కొణిదెల వారి ఆడపడుచు నిహారికకు, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ టీమ్ అందరికి నా అభినందనలు. మీరిచ్చిన ఈ స్పూర్తితో తను మరిన్ని జనరంజకమైన కోరుకుంటూ.. కంగ్రాచ్యులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ టూ డియర్ నిహా” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
@IamNiharikaK #OkaChinnaFamilyStory #Okachinnafamilystory @ZEE5Telugu #pinkelephantpictures #Sangeethshoban #SimranSharma #Maheshuppala #manasasharma pic.twitter.com/Dd63wNgIKn
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 29, 2021