సంక్రాంతి బరిలో దిగాల్సిన సిద్ధు జొన్నలగడ్డ మూవీ ‘డి.జె. టిల్లు’ విడుదల వాయిదా పడింది. వైరస్ విపరీతంగా స్ప్రెడ్ కావడంతో పాటు మూవీ కోర్ టీమ్ లోని కొందరు కరోనా బారిన పడటంతో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని మీడియాకు తెలియచేశారు. మూవీ విడుదల ఎప్పుడు చేసేది త్వరలో తెలియచేస్తామని అన్నారు. సంక్రాంతి బరి నుండి ‘ట్రిపుల్ ఆర్’ మూవీ తప్పుకోగానే జనవరి 14న తమ ‘డి.జె. టిల్లు’ను విడుదల చేస్తామని…
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘హీరో’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అశోక్ సరసన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇక ఈ సంక్రాంతి బరిలో నిలబడుతున్న ఈ సినిమా ట్రైలర్ ని తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే ట్రైలర్ విషయానికొస్తే.. చిన్నప్పటినుంచి…
టిక్ టాక్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అషూరెడ్డి. స్టార్ హీరోయిన్ సమంతలా ఉండడంతో అందరు ఆమెను జూనియర్ సమంత అని పిలవడం మొదలుపెట్టారు. దీంతో అమ్మడు కాస్తా ఫేమస్ అయ్యి బిగ్ బాస్ వరకు వెళ్ళింది. ఇక అనంతరం రామ్ గోపాల్ వర్మ తో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి మరింత ఫేమస్ అయ్యింది. ఇక నిత్యం సోషల్ మీడియా లో హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లను రెచ్చగొడుతున్న ఈ ముద్దుగుమ్మ తాజగా సమంత ఐటెం సాంగ్ ఊ…
ప్రముఖ నటి ఖుష్బూ సైతం కొవిడ్ 19 బారిన పడింది. ఇటు నటన, అటు రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉంటున్న ఖుష్బూ ఈ మధ్యకాలంలో ఢిల్లీ కూడా చుట్టొచ్చింది. కరోనా రెండు వేవ్ లను తప్పించుకున్న తాను చివరకు దానికి దొరికిపోయానంటూ ఖుష్బూ సోషల్ మీడియాలో కొద్ది సేపటి క్రితం ప్రకటించింది. ఆదివారం సాయంత్రం వరకూ తాను నెగెటివ్ లోనే ఉన్నానని, కొద్దిగా జలుబు ఉన్న కారణంగా ఈ రోజు చేయించుకున్న పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చిందని…
ప్రస్తుతం చిత్ర పరిశ్రమను కరోనా పట్టి పీడిస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో స్టార్లు కరోనా బారిన పడుతుండడం అభిమానవులకు భయాందోళనలను కలిగిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ అని లేకుండా పలు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇక దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా సీనియర్ స్టార్ హీరోయిన్ శోభన ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. ”…
అల్లు అరవింద్ – ఈ పేరు వింటే చాలు ముందుగా ఆయన ప్రణాళికలు గుర్తుకు వస్తాయి. ‘ఆహా’ ఓటీటీని సక్సెస్ రూటులో సాగేలా చేస్తున్నారు. అందులో భాగంగా ఏ నాడూ టాక్ షో చేయని నటసింహ నందమూరి బాలకృష్ణతో ‘ఆహా’ అనిపించేలా ‘అన్ స్టాపబుల్’ షో చేయిస్తున్నారు. దీనిని బట్టే అల్లు అరవింద్ మేధస్సులోని పవర్ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఎందరో యువనిర్మాతలు అరవింద్ ను ఆదర్శంగా తీసుకొని చిత్రసీమలో సాగుతున్నారు. కొందరు నిర్మాతలకు ఆయనే…
భారతీయ యవనికపై పోతపోసిన గ్రీకు శిల్పంలా నిలిచి జనం మనసు గెలిచాడు హృతిక్ రోషన్. గ్రీకువీరుడులాంటి శరీరసౌష్టవం సొంతం చేసుకున్న హృతిక్ ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడు అయిపోయాడు. తొలి చిత్రం ‘కహోనా ప్యార్ హై’తోనే హృతిక్ అందరి దృష్టినీ ఆకర్షించాడు. అప్పటికే హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ కు మీడియాతోనూ, రాజకీయంగానూ మంచి అనుబంధం ఉన్న కారణంగా, తనయుడిని స్టార్ గా నిలపడం ఆయనకు కష్టమేమీ కాలేదు. ఇక హృతిక్ రోషన్ పెళ్లి అయితే మూడు…
ఒకప్పుడు హిందీ రీమేక్స్ కు తెలుగులో విపరీతమైన క్రేజ్ తీసుకు వచ్చిన ఘనత నిస్సందేహంగా నటరత్న నందమూరి తారక రామారావుదే! ఆయన నటించిన “నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, ఆరాధన, నేరం నాది కాదు ఆకలిది” వంటి హిందీ రీమేక్స్ బాక్సాఫీస్ బరిలో జయకేతనం ఎగురవేశాయి. వాటి సరసన చేరిన చిత్రం యన్టీఆర్ నిర్మించి, నటించిన ‘అనురాగదేవత’. హిందీలో ఘనవిజయం సాధించిన ‘ఆషా’ ఆధారంగా ‘అనురాగదేవత’ రూపొందింది. 1982 జనవరి 9న సంక్రాంతి కానుకగా ‘అనురాగదేవత’ జనం…
ఆ రోజుల్లో సుప్రీమ్ హీరో చిరంజీవి, ఎ.కోదండరామిరెడ్డి కాంబో అంటే జనానికి ఎంతో క్రేజ్. అప్పటికే వీరిద్దరి కలయికలో రూపొందిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ ను భమ్ చిక భమ్ ఆడించాయి. అలా చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబోలో రూపొందిన ‘దొంగమొగుడు’ చిత్రం 1987 జనవరి 9న విడుదలై విజయపథంలో పయనించింది. చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబోలో అప్పటికే పలు నవలా చిత్రాలు సక్సెస్ సాధించాయి. ఈ నేపథ్యంలోనే యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ‘నల్లంచు తెల్లచీర’ నవలకు మరింత కథ…
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదం చోటుచేసుకొంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ అన్న రమేష్ బాబు కొద్దిసేపటి క్రితం మృతిచెందారు. గతకొన్ని రోజుల నుంచి కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రమేష్ బాబును చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు సమాచారం. ఇకపోతే రమేష్ కూడా హీరోగా పలు సినిమాల్లో నటించారు. ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలో చిన్నప్పటి అల్లూరి సీతారామరాజుగా నటించి మెప్పించారు. “దొంగలకే…