‘పుష్ప’ సినిమాతో భారీ విజయాన్ని అందుకొంది రష్మిక మందన్నా.. శ్రీవల్లిగా అమ్మడి యాక్టింగ్ కి, డాన్స్ కి ఫిదా అయిపోయారు అభిమానులు. ఇక ఈ సినిమా తర్వాత ఈ హాట్ బ్యూటీ కి అవకాశాలు తన్నుకుంటూ వస్తున్నాయి. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. రష్మిక స్కిన్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరుముఖ్యంగా ఎయిర్ పోర్ట్ డ్రెస్సింగ్ లో రశ్మికను కొట్టినవారే లేరు. చిట్టిపొట్టి డ్రెస్ లో అమ్మడు ముంబై ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చిన ప్రతిసారి నెటిజన్స్ ట్రోల్ చేస్తూనే ఉన్నారు.
తాజాగా మరోసారి రష్మిక చిట్టి నిక్కర్ లో దర్శనమిచ్చి అందరిని షాక్ కి గురిచేసింది. బ్లూ డెనిమ్ షార్ట్ పై క్రీమ్ కలర్ స్వేట్ టీ షర్ట్ వేసుకొని పింక్ కలర్ క్యాప్ తో క్యూట్ గా కనిపించింది. అయితే ఆ షార్ట్ మరీ చిన్నదిగా ఉండడంతో అమ్మడి హాట్ హాట్ థైస్ అన్ని బయటికి కనిపించేస్తున్నాయి. దీంతో నెటిజన్లు మరోసారి అమ్మడిపై విమర్శలు గుప్పించేశారు. ఏంటీ శ్రీ వల్లి ఈ షార్ట్ మరీ ఇంత చిన్నగానా అని కొందరు.. ఇంతోటి దానికి వేసుకోవడం ఎందుకు అంటూ మరికొందరు.. ఇంకా చిన్న షార్ట్ కొనలేదా..? అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. స్కిన్ షో చేయొచ్చు కానీ, మరి ఇంతలా అంటే బట్టలు వేసుకోవడం కూడా వేస్ట్ అని విమర్శిస్తున్నారు.