టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్.. బ్యాచిలర్స్ కి గురువుగా మారిపోయాడు. పెళ్లి గురించి బ్యాచిలర్స్ కి ఉపదేశాలు ఇచ్చేస్తున్నాడు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం వెకేషన్ మోడ్ లో ఉన్నాడు. కొండలు ఎక్కుతూ, జిమ్ చేస్తూ, బాడీ బిల్డర్ గా మారిపోయి కనిపిస్తున్నాడు. ఇక ఇటీవల కొన్ని ఫొటోల్లో నవదీప్ తెల్ల గడ్డంతో కనిపించాడు. ఇంకేముంది ఈ యంగ్ హీరో అభిమాన సంఘం విచిత్రమైన కామెంట్స్ తో విరుచుకుపడ్డారు. ఇందులో ఒక అభిమాని ” అన్నా గెడ్డం తెల్లబడుతోంది పెళ్లి చేసుకో..” అని అడిగాడు.
ఇక ఈ ప్రశ్నకు నవదీప్ తనదైన రీతిలో స్పందిస్తూ ఒక వీడియోని షేర్ చేశాడు. నన్ను కొంతమంది పెళ్లి గురించి అడుగుతున్నారు. “గెడ్డం తెల్లబడితే ట్రిమ్ చేసుకోవాలి.. పెళ్లి కాదు. దురద పుడితే గోక్కుంటాం కానీ తోలు పీకేసుకోలేం కదా” అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. అంతేకాకుండా పెళ్లి కన్నా పిల్లి బెటర్ అంటూ మరో ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోపై బ్యాచిలర్స్ సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సూపర్ అన్నా.. మాకు ఈ భాద తప్పడం లేదు.. ఇకనుంచి ఈ డైలాగ్ ని ఫాలో అయిపోతాం అని కొందరు. అన్నా నువ్వే మా గురువు.. ఇలాగే మోటివేట్ చేయి అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఏదిఏమైనా నవదీప్ కౌంటర్ ని బట్టి చుస్తే ఈ యంగ్ హీరో ఇప్పుడప్పుడే ఒక ఇంటివాడు అయ్యేలా అయితే కనిపించడం లేదని తెలుస్తోంది.
Oddhu ra sodhara 🙂 pic.twitter.com/IYKSAGFDVE
— Navdeep (@pnavdeep26) January 23, 2022