ప్రేమికుల రోజు కానుకగా ‘మళ్ళీ మొదలైంది’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుమంత్ నటించిన తాజా చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. వర్షిణీ సౌందర్ రాజన్, నైనా గంగూలీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఇప్పటికే తొలికాపీ సిద్ధమైన ‘మళ్ళీ మొదలైంది’ మూవీని ఫిబ్రవరిలో ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు.
తాజాగా ఈ సినిమాను ఫిబ్రవరి 11న ప్రేమికుల రోజు కానుకగా స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు జీ 5 సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్ ను హీరో సుమంత్ ట్వీట్ చేశారు. విడాకులు తీసుకున్న ఓ జంటకు సంబంధించిన కథ ఇది. చిత్రం ఏమంటే… హీరో విడాకుల కోసం ఓ లేడీ లాయర్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమెతోనే అతను ప్రేమలో పడతాడు. మొదట ఈ ప్రపోజల్ ను తిరస్కరించినా, ఆ తర్వాత ఆమె కూడా హీరోతో లవ్ లో పడుతుంది. అప్పటి వరకూ హీరో విడాకులు తీసుకుంటున్నాడని ఆడిపోసుకున్న వాళ్ళు, హేళన చేసిన బంధువులు… ఈ రెండో పెళ్లి విషయంలో ఎలా రియాక్ట్ అయ్యారన్నదే సినిమా కథ.
Also Read
#MalliModalaindi, a quirky tale of life after divorce, premieres this Feb 11 on #ZEE5#MalliModalaindiOnZEE5 @tgkeerthikumar @NainaGtweets @ManjulaOfficial @hasinimani @vennelakishore @tej_uppalapati @anuprubens #VarshiniSounderajan #PavaniReddy 🔗https://t.co/VFrfd7SjT1 pic.twitter.com/IEexccHqbo
— Sumanth (@iSumanth) January 23, 2022
తాజావార్తలు
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!