Prashanth Varma: అ! లాంటి సైకలాజికల్ ఫాంటసీ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ సినిమా కలక్షన్స్ రాబట్టలేదు కానీ, మంచి గుర్తింపుతో పాటు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తరువాత ప్రశాంత్ వర్మ.. కల్కి, జాంబీ రెడ్డి లాంటి సినిమాలు తీసి మెప్పించాడు. ఇక ఇప్పుడు హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Sundaram Master: మాస్ మహారాజా రవితేజ.. ఒకపక్క హీరోగా బిజీగా ఉంటూనే.. ఇంకోపక్క నిర్మాతగా కూడా వరుస సినిమాలను చేస్తున్నాడు. ఆర్టీ టీమ్ వర్క్స్ అనే బ్యానర్ ను నిర్మించి.. తన సినిమాలకే కాకుండా చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ నుంచి మట్టి కుస్తీ, ఛాంగురే బంగారు రాజా వంటి సినిమాలు వచ్చాయి.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ కు మొదటి నుంచి సినిమాలు, ఫ్యామిలీ.. ఇవి తప్ప వేరే ప్రపంచం లేదు అన్నది అందరికి తెల్సిన విషయమే.
Sivaji: నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 7 తరువాత అందరికీ శివాజీ ఫేవరేట్ గా మారిపోయాడు. ఇక హూసు నుంచి బయటకు వచ్చాకా తనకు పరిచయం ఉన్న పెద్దలను కలవడం మొదలుపెట్టాడు. ఒకపక్క పల్లవి ప్రశాంత్, యావర్ లతో కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తాను అని చెప్పుకొచ్చాడు.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ఒక ఏడాది నుంచి రెస్ట్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. మయోసైటిస్ వ్యాధితో చికిత్స తీసుకుంటున్న సమంత.. దాంతో పాటు మానసిక ప్రశాంతత కోసం షూటింగ్స్ కు ఒక ఏడాది ఫుల్ స్టాప్ పెట్టింది.ఇక ఈ రెస్ట్ మోడ్ ను వెకేషన్ మోడ్ గా మార్చుకొని ప్రపంచం మొత్తం తిరిగేస్తుంది. వెండితెరపై కనిపించకపోయినా కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది.
Shivaji: నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్.. బిగ్ బాస్ సీజన్ 7 కు గేమ్ ఛేంజర్ గా మారిన విషయం తెల్సిందే. చాలావరకు శివాజీనే బిగ్ బాస్ విన్నర్ గా నిలుస్తాడని అనుకున్నారు. కానీ, చివరకు పల్లవి ప్రశాంత్ ను విన్నర్ గా చేశాడు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాకా కొన్నిరోజులు రెస్ట్ తీసుకున్న శివాజీ ఈ మధ్య మీడియా ముందు గట్టిగానే కనిపిస్తున్నాడు.
Guntur Kaaram: ఆ కుర్చీని మడతపెట్టి సాంగ్.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నెగెటివ్ గానో.. పాజిటివ్ గానో పక్కన పెడితే.. ట్విట్టర్ మొత్తం దాని గురించే మాట్లాడుకుంటుంది. త్రివిక్రమ్ నుంచి ఇలాంటి సాంగ్ ఊహించలేదని కొందరు.. మహేష్ బాబు ఇలాంటి బూతు అంటాడని అనుకోలేదని మరికొందరు ట్రోల్స్ చేస్తున్నారు.
Guntur Kaaram:అతడు, ఖలేజా తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యింది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Venky Re Release: ఇప్పుడు వస్తున్న సినిమాలకు చాలామంది కుటుంబాలను తీసుకెళ్లడానికి భయపడుతున్నారు. చిన్నపిల్లలతో కలిసి సినిమా చూడలేని పరిస్థితి. శృతిమించిన శృంగారం, మితిమీరిన హింస.. ఇవే ఎక్కువగా చూపిస్తున్నారు. కానీ, అప్పట్లో రిలీజ్ అయిన సినిమాలు గురించి మాట్లాడుకుంటే.. కుటుంబం మొత్తం ఎన్నిసార్లు సినిమాకు వెళ్లినా మనసంతా ఆనందం నింపుకొని, కష్టాలను, కన్నీళ్లను మర్చిపోయి.. థియేటర్ బయటకు నవ్వుకుంటూ వచ్చేవారు. ఇక ఆ సినిమాలే సినిమాలు.
Jayaprada: సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద మిస్సింగ్ అంటూ ఉదయం నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి. ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ ను కోర్ట్ జారీ చేసింది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ కోర్టు ఆమెకు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.