Director Bobby: చిరు సినిమాను రవితేజ రిజెక్ట్ చేశాడు.. కథ నచ్చక వద్దు అంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Director Bobby:మాస్ మహారాజా రవితేజ ఇండస్ట్రీకి ఎంతోమంది కొత్త డైరెక్టర్లను పరిచయం చేశాడు. అందులో బాబీ ఒకడు. పవర్ అనే సినిమాతో బాబీ అలియాస్ కొల్లి రవీంద్ర డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక రెండో సినిమానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆ తరువాత ఎన్టీఆర్ తో జై లవకుశ తీసి మంచి విజయాన్ని అందుకున్నాడు. గతేడాది.. చిరు తో వాల్తేరు వీరయ్య సినిమాను తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్నాడు బాబీ. ఈ సినిమా కోసం బాబీ చాలా కష్టపడినట్లు ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. ముందుగా చిరు కోసమే కథను రెడీ చేసినా కూడా .. మధ్యలో రవితేజ పాత్రను అనుకున్నట్లు తెలిపాడు. అయితే మొదట ఆ పాత్రకు రవితేజ ఒప్పుకోలేదని బాబీ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.
“వాల్తేరు వీరయ్య సినిమా కథ ముందు చిరంజీవి గారికి చెప్పాను. అప్పుడు రవితేజ పాత్ర గురించి నేనేమి అనుకోలేదు. కథ మొత్తం పూర్తి అయినా కూడా ఎక్కడో ఏదో అసంతృప్తి. నాకు జీవితాన్ని ఇచ్చింది రవితేజనే.. అందుకే నేను ఏ కథ అనుకున్నా కూడా ఆయనే కనిపించేవాడు. అలా ఓరోజు వాల్తేరు వీరయ్య కథ సెకండాఫ్‌లో రవితేజను తీసుకొద్దాం అని నా టీమ్‌కు చెప్పాను. వాళ్లు ఓకే అన్నారు. కానీ అప్పటికే చిరంజీవితో 80 శాతం సినిమా పూర్తయింది. నేను ఇలా అనుకుంటాను అని నా టీమ్ కు చెప్తే ఓకే అన్నారు. అయితే.. చిరంజీవి గారు ఎలా ఫీల్ అవుతారు అనే విషయం నాకు తెలియదు.. ఒకరోజు రవితేజ అని చెప్పకుండా చిరుకు.. తమ్ముడి పాత్ర గురించి చెప్పాను. ఆ పాత్ర రవితేజ చేస్తున్నాడు కదా.. అదిరిపోయింది అని అన్నారు.
Also Read
- Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
- RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
ఇక నిర్మాత అయితే లైట్ గా వార్నింగ్ ఇచ్చారు. ఎంతైనా ఖర్చుపెడతాం.. కానీ, మిస్ ఫైర్ కాకుండా చూసుకో అని చెప్పేశారు. చాలారోజులు అలోచించి.. రవితేజకు ఫోన్ చేసి కథ చెప్పాలి అని అడిగాను. ముందు చిరంజీవిగారి సినిమా పూర్తి చెయ్.. తరువాత చూద్దాం అన్నారు. అయితే ఆరు నెలలపాటు ఆ పాత్రను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుకుని రవితేజ వద్దకు వెళ్లి కథ చెప్పాలి అంటే.. చిరంజీవి సినిమాలోనా అని అడిగారు. అవును అన్నాను. ముందు కథ చెప్తాను.. నచ్చితేనే చేయండి అన్నాను. ఆయన మాత్రం వద్దులే అబ్బాయ్.. ఇప్పటికే నాకు వరుసగా సినిమాలున్నాయ్.. మళ్లీ నువ్వు కథ చెప్పాక నచ్చలేదంటే బాగోదు.. చిరు సినిమాను రవితేజ రిజెక్ట్ చేశాడు అన్న పేరు వద్దు అన్నాడు. ముందు కథ వినండి.. తరువాత నచ్చకపోతే చేయొద్దు అని చెప్పాను. కథ కూడా వినకుండా తెల్లారి.. నన్ను పిలిచి, అన్నయ్యతో ఎప్పటినుంచో ఒక సినిమా చేద్దామనుకుంటున్నాను.. చేసేద్దాం అన్నారు. అలా వారిద్దరి కాంబినేషన్ కుదిరింది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బాబీ.. బాలకృష్ణతో NBK109 సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో బాబీ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!