Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. కొంతమంది కావాలనే ఈ సినిమాకు నెగెటివ్ టాక్ ను సృష్టించారని మేకర్స్ ఆరోపిస్తున్నారు. ఇక మహేష్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ సినిమా ఐ ఫీస్ట్ అని చెప్పాలి. ఇంత ఎనర్జీగా, ఇలాంటి డ్యాన్స్.. మహేష్ మునుపెన్నడూ చేయలేదు అని చెప్పుకోవాలి. రిజల్ట్ ఎలా ఉన్నాకూడా ప్రేక్షకులు మాత్రం గుంటూరు కారం ను సంక్రాంతి విన్నర్ అని చెప్పుకొచ్చేస్తున్నారు. కలక్షన్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి.
ఇక ఈ సినిమా సక్సెస్ అందుకోవడంతో.. రెండు రోజుల క్రితం మహేష్.. తన ఇంట్లో చిత్ర బృందానికి పార్టీ ఇచ్చిన విషయం తెల్సిందే. అయితే ఆ పార్టీకి డైరెక్టర్ త్రివిక్రమ్ రాలేదు. దీంతో ఈ ఒక్క పార్టీతోనే సరిపెట్టడంలేదని.. దీనికి మించిన సక్సెస్ సెలబ్రేషన్స్ ఉన్నాయని చెప్పుకొచ్చారు. చిత్రబృందం మొత్తం కలిసి ఒక సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ క్యాన్సిల్ అయ్యినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ అందుబాటులో లేకపోవడంతో ఈ పార్టీని క్యాన్సిల్ చేశారట. ఇక ఈ పార్టీ లేకపోవడంతో మహేష్.. కుటుంబంతో కలిసి జర్మనీ వెకేషన్ కు వెళ్లనున్నట్లు సమాచారం. ఇక గురూజీ కారణంగానే గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్ క్యాన్సిల్ అవ్వడంతో అసలు త్రివిక్రమ్ కు ఏమైంది.. ? అని అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెట్టారు. కొంతమంది త్రివిక్రమ్ కు హెల్త్ బాలేదని చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.