Anchor Suma: యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవ్వడానికి కేరళ అమ్మాయి అయినా కూడా అచ్చ తెలుగు అమ్మాయిలా ఎన్నో ఏళ్లుగా ఆమె కలిసిపోయి జీవిస్తుంది. తెలుగు అమ్మాయిల కన్నా ఎంతో ఎక్కువగా తెలుగు మాట్లాడగలదు. తెలుగు అబ్బాయి రాజీవ్ ను వివాహమాడి ఇక్కడే సెటిల్ అయ్యిపోయింది. యాంకర్ గా ఎంతోమందికి ఐకాన్ మారిన సుమ.. ఎప్పుడు అచ్చ తెలుగు ఆడవారిలా చీరలోనే కనిపిస్తూ ఉంటుంది. అయితే సుమ ఈసారి మోడ్రన్ లుక్ లోకి మారింది. గతనెల సుమ, రాజీవ్ ల తనయుడు రోషన్ హీరో బబుల్ గమ్ సినిమా రిలీజ్ అయిన విషయం తెల్సిందే. మొదటి సినిమా అయినా కూడా రోషన్ ఎంతో చక్కగా నటించి మెప్పించాడు. సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేనప్పటికీ.. రోషన్ కు మంచి పేరే తెచ్చిపెట్టింది.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం సుమ చాలానే కష్టపడింది. స్టార్లను కలిసి, వారిచేత ట్రైలర్ , సాంగ్స్ రిలీజ్ చేయించింది. టీవీ షోస్ కు కొడుకును తిప్పుతూ హైప్ తీసుకొచ్చింది. అందులో భాగంగానే ఆమె.. బబుల్ గమ్ పేరుతో ఉన్న టీ షర్ట్ ను వేసుకొని ఒక ఫోటోషూట్ చేసింది. టైట్ జీన్స్ పై హొల్స్ ఉన్న టీ షర్ట్, గాగుల్స్ తో సుమ లుక్ మార్చేసింది. ఇక ఈ ఫోటోషూట్ జరిగేటప్పుడు రాజీవ్ కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ లుక్ లో సుమను చూసి రాజీవ్.. వామ్మో అంటూ వణికిపోయాడు. మోడల్ అంటూ ఏడిపించాడు. ఈ ఫోటోషూట్ తరువాత మా ఆయన రియాక్షన్ అని సుమ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సుమక్క.. స్టన్నింగ్ అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.