Renu Desai:నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . బద్రి సినిమాతో టాలీవుడ్ కు పరిచయామైన ఆమె.. పవన్ ను వివాహమాడి మెగా కోడలిగా మారింది. ఇక కొన్నేళ్ళకు కొన్ని విబేధాల కారణంగా పవన్ నుంచి విడిపోయి.. కొడుకు అకీరా, కూతురు ఆద్యతో కలిసి నివసిస్తోంది. పవన్, రేణు భార్యాభర్తలుగా విడిపోయినా.. తల్లిదండ్రులుగా తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఇక రేణు.. పిల్లలను ఎప్పుడు మెగా కుటుంబానికి దగ్గరగానే పెంచుతుంది. మెగా కుటుంబంలో ఎలాంటి వేడుక జరిగినా కూడా అకీరా, ఆద్య హాజరవుతారు. ఈ మధ్య జరిగిన సంక్రాంతి సంబురాల్లో అకీరా, ఆద్యనే హైలైట్ గా నిలిచిన విషయం తెల్సిందే. నిత్యం రేణు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అయితే తన ఫోటోలు కానీ, లేకపోతే అకీరా, ఆద్య ఫోటోలను షేర్ చేస్తూ తన అభిప్రాయాలను చెప్తూ ఉంటుంది.
ఇకపోతే తాజాగా రేణు పర్సనల్ సెక్యూరిటీని పెట్టుకున్నట్లు వీడియో ద్వారా తెలిపింది. అది ఎవరో కాదు ఆమె గారాల పట్టీ ఆద్య. వీడియోలో ఆద్య.. బాక్సింగ్ పంచ్ లు విసురుతున్నట్లు కనిపించింది. ఇక ఈ వీడియోకు రేణు అద్భుతమైన క్యాప్షన్ పుట్టుకొచ్చింది. ” ఈరోజు నుంచి నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకొంటే.. మీరు నా పర్సనల్ సెక్యూరిటీతో డీల్చేసుకోవాల్సి ఉంటుంది.. జాగ్రత్త” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. క్యూట్ ఆద్య అని కొందరు.. మీకు మీ పిల్లలే బలం అని ఇంకొందరు కామెంట్స్ పెట్టుకొస్తున్నారు.