Suhasini Maniratnam: సీనియర్ సుహాసిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముగ్ద మనోహరమైన మోము.. నవ్వితే ముత్యాలు రాలేనేమో అనేంత అందమైన రూపం ఆమె సొంతం. అచ్చ తెలుగు అమ్మాయిలా అనిపించే తమిళ్ కుట్టీ సుహాసిని. ఇక స్టార్ డైరెక్టర్ మణిరత్నంను ప్రేమించి పెళ్ళాడి.. సుహాసిని మణిరత్నంగా మారింది. పెళ్లి తరువాత కూడా సుహాసిని స్టార్ హీరోలకు తల్లిగా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక దీంతో పాటు.. భర్త సినిమాలకు నిర్మాతగా కూడా పనిచేస్తోంది. ఇక చాలా కలం తరువాత సుహాసిని.. ఒక ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ ఆమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ముఖ్యంగా చిరంజీవితో తనకు అనుబంధం గురించి చెప్పుకొచ్చింది. మొదట్లో ఆయనను చూసి విలన్ అనుకున్నట్లు తెలిపింది.
“మంచుపల్లకి కన్నా ముందు కాళీ అనే తమిళ్ సినిమాలో చిరంజీవి నటించినప్పుడు నేను ఆ సినిమాకు కెమెరా అసిస్టెంట్ గా చేశాను. అప్పుడే కొత్తగా పెళ్లి అయ్యింది. ఒక మూలాన కూర్చొని ఉన్నారు. ఏంటి ఆయన అలా కూర్చున్నారు అని వేరేవాళ్లను అడిగితే.. తెలుగాయన.. తమిళ్ అంత పెద్దగా రాదు అని చెప్పారు. నేను వెళ్లి మాట్లాడేదాన్ని.. అప్పుడు నాకు తెలియదు నేను హీరోయిన్ అవుతాను అని, ఆ తరువాత నా సెకండ్ ఫిల్మ్ చిరంజీవి గారితో చేశాను. అది పెద్ద హిట్ అయ్యింది. తమిళ్ ఫిల్మ్ అది.. అందులో ఐదుగురు హీరోలు.. లేడీ ఓరియెంటెడ్ సినిమా.. అందరికీ ఈక్వల్ పాత్రలు. అప్పుడే చిరంజీవి గారు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారు. మంచి సినిమాలో ఉండాలి మనం కూడా అని చేశారు. ఆ సినిమా షూటింగ్ లో మా ఇద్దరికీ గొడవ. నాకు కొంచెం పొగరు ఉంది అని అనుకునేవారు. నాకు రిప్లెక్ట్ వేసిన అమ్మాయి.. ఇప్పుడొచ్చి హీరోయిన్ ఏంటి..? అని, ఆయనతో మాట్లాడిన మొదటి సంఘటన నాకు బాగా గుర్తుంది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో ఇద్దరం పక్క పక్కన కూర్చున్నాం. ఏ హోటల్ వేశారు అన్నారు. నేను అశోక అన్నాను.. ఎన్నిరోజులు షూట్ అంటే 30 నుంచి 35 రోజులు అని చెప్పాను. వెంటనే ఆయన.. ఇన్నిరోజుల్లో ఏదైనా హెల్ప్ కావాలంటే.. నా దగ్గరికి మాత్రం రాకు.. నీది నువ్వే చూసుకోవాలి అని చెప్పి నిద్రపోయారు. హైదరాబాద్ వచ్చాక లేచారు. నేను షాక్ అయ్యాను.. ఏంటి ఇలాంటి క్యారెక్టర్ ఇది.. నా పక్కన కూర్చొని నిద్రపోయారు.. హెల్ప్ చేస్తాను అనకుండా.. నీది నువ్వే సాల్వ్ చేసుకోవాలి అన్నారు అని అనుకున్నాను. అలా మా రిలేషన్ షిప్ మొదలయ్యింది. ఆయనలా సెన్సాఫ్ హ్యూమర్ ఎవరికి ఉండదు.
ఒక తమిళ్ పిక్చర్ లో నేను, సుమలతగారు నటిస్తుంటే.. అప్పుడు సుమలతగారు అడిగారు.. ఏంటి.. చిరంజీవి గారితో యాక్ట్ చేస్తున్నావంట కదా అని.. అయితే ఏంటి అన్నాను. ఒక పెద్ద హీరో.. గ్రేట్ యాక్టర్.. అప్ కమింగ్ స్టార్ .. తమిళ్ లో కమల్ ఎలానో.. తెలుగులో ఆయన అలా అని చెప్పుకొచ్చింది. అయ్యో చూడడానికి విలన్ లా ఉన్నారే అన్నాను. ఆ విషయం సుమలత, చిరంజీవిగారికి చెప్పేసింది. నెక్ట్స్ డే షూట్ లో విలన్ తో ఎవరు యాక్ట్ చేస్తారు.. అని ఏడిపించారు. నువ్వు హీరోయిన్.. నేను విలన్ అంతేనా అంటే .. లేదు సార్ సారీ.. సారీ అని చెప్పాను. ఇక అలా మా సినిమా ప్రయాణం మొదలయ్యింది. ఆ తరువాత మగమహారాజు సినిమా చేస్తున్న సమయంలో క్లయిమాక్స్ ల మూడు రోజులు షూటింగ్ కు రాలేదు. నిర్మాత చాలా కోప్పడి నెక్స్ట్ సినిమా నన్ను కాకుండా రాధికను తీసుకున్నారు. ఆ తరువాత ఒక సినిమా సెట్ లో మేము కలిసి మాట్లాడుతుంటే.. చిరంజీవి ఏంటి అమ్మాయి నిర్మాతగారు నిన్ను తీసుకోలేదా.. మూడు రోజులు షూటింగ్ రాకపోతే.. ఆమె టాలెంట్ ను చూడరా.. ? అని అడిగేశారు. వెంటనే ఆయన నెక్స్ట్ సినిమా మహారాజులో నాకు ఛాన్స్ వచ్చింది. అది సూపర్ హిట్. చిరంజీవి గారి మంచి మనసు ఎవరికి ఉండదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.