Niharika Konidela: మెగా సంక్రాంతి సంబురాలు బెంగుళూరు ఫామ్ హౌస్ లో ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. మూడు రోజులు మెగా- అల్లు ఫ్యామిలీస్ పండగను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. పవన్ కళ్యాణ్ తప్ప.. అందరూ ఈ వేడుకలకు హాజరయ్యారు. ఇక పండగ పూర్తికావడంతో నిన్ననే హైదరాబాద్ కు చేరుకున్నారు. పండుగరోజు ఉపాసన.. అక్కడ జరిగిన విశేషాలను లైవ్ అప్డేట్స్ ఇస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు మెగాడాటర్ వంతు. ఇంటికి వచ్చి తీరిగ్గా కజిన్స్ తో ఎంజాయ్ చేసిన వీడియోస్, ఫొటోస్ ను అభిమానులతో షేర్ చేసుకుంది. మెగా ఫ్యామిలీలో నిహారిక ఎంతో స్పెషల్. నాగబాబు కూతురు అన్నమాటే కానీ, మెగా ఫ్యామిలీ మొత్తం నిహారికను ప్రిన్సెస్ గానే చూస్తారు. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఒకపక్క నటిగా, ఇంకోపక్క నిర్మాతగా ఎదగడానికి ప్రయత్నిస్తుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన మనసుకు నచ్చినట్లు జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.
ఇక గతేడాది నిహారిక అన్న, హీరో వరుణ్ తేజ్ పెళ్లి ఘనంగా జరిగిన విషయం విదితమే. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్న వరుణ్..నిహాకు తన బెస్ట్ ఫ్రెండ్ నే వదినగా తీసుకొచ్చాడు. పెళ్ళికి ముందు నుంచి కూడా నిహా, లావణ్య ఫ్రెండ్స్. పెళ్లి తరువాత కూడా వారు ఫ్రెండ్స్ లానే ఉంటున్నారు. ఈ సంక్రాంతి సంబురాల్లో హడావిడి అంతా వదినాఆడపడుచులదే అని తెలుస్తోంది. ఈ వేడుకల్లో ఈ వదినా ఆడపడుచులు ఇద్దరు.. డ్యాన్స్ తో అదరగొట్టారు. బాబాయ్ పవన్ కళ్యాణ్ సాంగ్ కు నిహా, లావణ్య డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఇక నిహారిక.. తన కజిన్స్ తో చేసిన అల్లరి మొత్తం ఈ ఫోటోలలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. దినా ఆడపడుచుల డ్యాన్స్.. చూడముచ్చటగా ఉందే అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.