Samantha: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సామ్.. రెస్ట్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఒక ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి ప్రకృతిని ఎంజాయ్ చేస్తుంది. ఇక దాంతో పాటు మయోసైటిస్ కు చికిత్స తీసుకుంటుంది. సినిమాలు మాత్రమే సామ్ చేయడం ఆపేసింది..కానీ, సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఇక సామ్, చై విడిపోయి ఏళ్లు గడుస్తున్నా.. వారి గురించి ఏ వార్త వచ్చినా.. సామ్ గురించి చై కానీ, చై గురించి సామ్ కానీ మాట్లాడిన వైరల్ గా మార్చేస్తూ ఉంటారు. తాజాగా సామ్.. చై గురించి మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. వారం రోజుల్లో ఒక్కసారైనా సామ్.. అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.
ఇక తాజాగా సామ్.. ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. అభిమానులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఒక నెటిజన్.. సామ్.. మీ జీవితంలో మీరు చేసిన అతిపెద్ద తప్పు ఏంటి.. ? అని అడగ్గా .. దానికి సామ్.. నేను నా ఇష్టాలను, అయిష్టాలను తెలుసుకోవడంలో ఫెయిల్ అయ్యాను. ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం అతి పెద్ద పొరపాటుగా నేను భావిస్తున్నాను. నాకు దగ్గరయిన వారితో, నా జీవిత భాగస్వామి నన్ను ప్రభావితం చేయడం వలన.. నాకున్న ఇష్టాలు ఏంటి.. అయిష్టాలు ఏంటి అనేది గుర్తించలేకపోయాను. క్లిష్ట సమయం నుంచి విలువైన పాఠం నేర్చుకోగలమని అర్థమైన తర్వాతే నా వ్యక్తిగత ఎదుగుదల మొదలైంది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.