Prabhas: యాక్షన్ హీరో కాదు.. పక్కా లవర్ బాయ్! డార్లింగ్ ప్రభాస్ ఫేవరెట్ మూవీ ఏదో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా రెబల్ స్టార్ ప్రభాస్ పేరు తెలియని వారుండరు. తిరుగు లేని పాన్ ఇండియా హీరో ప్రభాస్. ప్రభాస్ సినిమాకు ఎంత క్రేజ్ ఉంటుందో పెద్దగా చెప్పనవసరం లేదు. ఇటీవల అనేక యాక్షన్ సినిమాలు తీస్తున్నాడు ప్రభాస్. డార్లింగ్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ చిత్రం చేస్తున్నాడు. వార్ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ అద్భుతంగా ఉండబోతుందని అంచనా. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించబోతున్నాడు. అయితే.. కపుల్ ఫ్రెండ్లీ సినిమా టీమ్ తాజాగా ప్రభాస్‌ను ఓ క్వశ్చన్ అడిగింది. “మీకు ఇష్టమైన సినిమా ఏంటి?” అని డార్లింగ్‌ను అడగ్గా.. షాకింగ్ సమాధానం చెప్పాడు. సాధారణంగా ప్రభాస్ యాక్షన్ చిత్రాలను ఇష్టపడతాడని అనుకుంటారు. కానీ.. మణిరత్నం రూపొందించిన “గీతాంజలి” సినిమా తనకు ఎంతో ఇష్టమని ప్రభాస్ వెల్లడించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కపుల్ ఫ్రెండ్లీ టీమ్‌తో పాటు ఆ వీడియో చూసిన ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రభాస్ అనేక హిట్ సినిమాలు తీశాడు. కానీ తనకు ఇష్టమైన సినిమా “గీతాంజలి” అని చెప్పడం అబ్బురపర్చింది.
Also Read
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రెబెల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘ఫౌజీ’. సక్సెస్ ఫుల్ పాన్-ఇండియా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో టి-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక దసరా పండుగ సందర్భంగా ‘ఫౌజీ’ గ్రాండ్‌గా రిలీజ్ కానుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. ఇక షూటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి విరామం లేకుండా కంటిన్యూ షెడ్యూల్ కొనసాగనుందని తెలుస్తోంది. అత్యంత గ్రాండ్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ ‘ఫౌజీ’ విజువల్ వండర్ గా ఉండబోతోంది.
READ MORE: Mohammad Amir: పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ ‘బలుపు’ మాటలు.. టీమిండియా సెమీ ఫైనల్‌కు చేరదంటూ అక్కసు!
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!