Kabali Producer KP Chowdary: టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. ఇప్పట్లో డ్రగ్స్ నీడ వీడేలా కనిపించడం లేదు. డగ్స్ కేసులో సినీ పరిశ్రమకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం ఉన్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.
Rakul Preet Singh: డ్రగ్స్ కేసు దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఎన్ ఫోర్స్ మెంట్ (ఈడీ) నోటీసులు ఇచ్చింది. ఈనెల 19వతేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపింది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసు మలుపులు తిరుగుతోంది. ఈడీ కోర్ట్ ధిక్కరణ పిటీషన్ తో ముందు కొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈడీ అడిగిన అన్ని వివరాలు ఇచ్చేసింది ప్రభుత్వం. డిజిటల్ రీకార్డ్స్ ,కాల్ డేటా, ఎఫ్ఎస్ఎల్ నివేదిక లను ఈడీ కి అందించినట్లు తెలిపింది ప్రభుత్వం. ఈడీ అడిగిన వివరాలు ఇచ్చినట్లు హైకోర్టు రిజిస్టర్ కు మెమో దాఖలు చేసింది ప్రభుత్వం. చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్పరాజ్ అహ్మద్ పై హైకోర్టులో కోర్టు…
తెలుగు చిత్ర పరిశ్రమను ఒక ఊపు ఊపేసిన టాలీవుడ్ డ్రగ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవలే ఇది విచారణ ఎదుర్కున్న సెలబ్రిటీలకు మళ్లీ గుండెల్లో గుబులు మొదలైంది. తాజాగా ఈడీ మరోసారి డ్రగ్ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను ఇవ్వాల్సిందిగా ఎక్సైజ్ శాఖకు లేఖ రాసింది. ఇటీవల ఈ కేసు పూర్తీ వివరాలను, రిపోర్టులను ఈడీ కి ఇవ్వాల్సిందిగా హైకోర్టు ఎక్సైజ్ శాఖకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇక మరోసారి ఆ రిపోర్టులను తమకు స్వాధీనం…
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో బుధవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. డ్రగ్స్ కేసులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 2017లో దాఖలు చేసిన పిల్‌పై ఈరోజు హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈడీకి సహకరించడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది రచనరెడ్డి పేర్కొంది. కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్న కేసులో రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సరిగా లేదన్నారు. ఆన్‌లైన్ విచారణలో నేరుగా కోర్టుకు ఈడీ జేడీ అభిషేక్ గోయెల్ వివరించారు. ఈడీ…
టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయంలో హాజరైన నటుడు తరుణ్ విచారణ ముగిసింది. 8 గంటల పాటు తరుణ్ ను అధికారులు విచారించారు. కాగా, ఈరోజుతో ముగిసిన సినీతారల విచారణ ముగిసింది. తమ బ్యాంక్ ఖాతాల వివరాలు, స్టేట్ మెంట్ లతో 12 మంది సినీ సెలబ్రిటీలు విచారణకు హాజరైయ్యారు. పూరి జగన్నాథ్ తో ప్రారంభం అయ్యిన ఈడీ విచారణ, తరుణ్ తో సినీ తారల విచారణ ముగిసింది. ఆగస్ట్ 31న పూరి జగన్నాథ్…
గత కొన్ని రోజులుగా ఆసక్తికరంగా మారిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటుడు తరుణ్ నేడు విచారణకు హాజరయ్యాడు. ముగ్గురు ఈడీ అధికారుల బృందం తరుణ్ ను విచారిస్తున్నారు. కెల్విన్ తో ఆయనకు ఉన్న సంబందాలు, బ్యాంక్ లావాదేవీలు పై ఈడీ ఆరా తీస్తోంది. విచారణలో భాగంగా అధికారులకు బ్యాంక్ స్టేట్మెంట్లు ను అందజేశాడు తరుణ్. 2017 డ్రగ్స్ కేసులో తరుణ్ ఇచ్చిన స్టేట్మెంట్ అంశాల ఆధారంగా ఆయనను ఈడీ ప్రశ్నిస్తోంది. ఇందులో మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనల…
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన సెలెబ్రెటీలకు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన కెల్విన్ సంబంధించి పలు కీలక విషయాలను ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఈమేరకు ఆయన ఛార్జ్ షీట్‌లో అంశాలను కూడా తెలియచేసింది. ఎక్సైజ్ శాఖ ప్రకారం.. ‘కెల్విన్ మంగళూరులో చదువుకునేటప్పుడు డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు. 2013 నుంచి తన స్నేహితులకు డ్రగ్స్ అమ్మడం మొదలు పెట్టాడు. గోవా, విదేశాల నుండి డార్క్ వెబ్…
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలపై ప్రధాన నిందితుడు కెల్విన్ ఇచ్చిన ఆధారాలు బలంగా లేవని ఎక్సైజ్ శాఖ తెలిపింది. కెల్విన్ పై ఛార్జ్ షీట్ లో సినీ తారల విచారణ ప్రస్తావించిన ఎక్సైజ్ శాఖ.. ఈమేరకు సెలబ్రిటీలపై కెల్విన్ చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవని పేర్కొంది. సినీ తారలు, విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, హోటల్ నిర్వాహకులకు డ్రగ్స్ అమ్మినట్లు కెల్విన్ వాంగ్మూలం ఇచ్చారు. ఎక్సైజ్ శాఖ ప్రకారం.. ‘సిట్ బృందం పలువురికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించింది.…