గత కొన్ని రోజులుగా ఆసక్తికరంగా మారిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటుడు తరుణ్ నేడు విచారణకు హాజరయ్యాడు. ముగ్గురు ఈడీ అధికారుల బృందం తరుణ్ ను విచారిస్తున్నారు. కెల్విన్ తో ఆయనకు ఉన్న సంబందాలు, బ్యాంక్ లావాదేవీలు పై ఈడీ ఆరా తీస్తోంది. విచారణలో భాగంగా అధికారులకు బ్యాంక్ స్టేట్మెంట్లు ను అందజేశాడు తరుణ్. 2017 డ్రగ్స్ కేసులో తరుణ్ ఇచ్చిన స్టేట్మెంట్ అంశాల ఆధారంగా ఆయనను ఈడీ ప్రశ్నిస్తోంది. ఇందులో మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన విషయాలపై కూడా విచారం జరుగుతోంది. ఇక 2017 జూలై 19న స్వచ్ఛందంగా ఎక్సైజ్ శాఖ కు బయో షాంపుల్స్ ఇచ్చాడు తరుణ్. తరుణ్ ఇచ్చిన బయో షాంపుల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు లేనట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రీపోర్ట్ లో వెల్లడైంది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
Read Also : మెగాస్టార్ చేతుల మీదుగా “రిపబ్లిక్” ట్రైలర్
కొద్దీ రోజులు క్రితమే డ్రగ్స్ కేసులో ఛార్జ్ షీట్ వేసింది ఎక్సైజ్ శాఖ. విచారణ లో భాగంగా తరుణ్ నుండి నమూనాలను సేకరించి FSL కి పంపారు అధికారులు. అయితే తరుణ్ నుండి సేకరించిన నమునాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని FSL రిపోర్ట్ లో వెల్లడైంది. దీంతో హీరో తరుణ్ తో పాటు డైరెక్టర్ పూరీకి ఎక్సైజ్ శాఖ క్లిన్ చిట్ ఇచ్చింది.