Rakul Preet Singh: డ్రగ్స్ కేసు దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఎన్ ఫోర్స్ మెంట్ (ఈడీ) నోటీసులు ఇచ్చింది. ఈనెల 19వతేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపింది. గతంలో బెంగళూరు డ్రగ్స్ కేసు రాష్ట్రంలో కలకలం రేపింది. ఇందులో పలువురు సినీ తారల హస్తం ఇందులో ఉందనే వార్తలు కలకలం సృష్టించాయి. వారికి గతంలో పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక మరోసారి ఈ కేసులో ఈడీ దూకుడు పెంచింది.
Read Also: Supreme Court : సుప్రీం సీరియస్.. లంచగొండి అధికారులపై కనికరం అక్కర్లేదు
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురు సెలబ్రెటీలను ఈడీ గతంలో విచారించింది. తాజాగా విచారణకు హాజరు కావాలని రకుల్‌కు నోటీసులు రావడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. డ్రగ్స్ డీలింగ్‌తో సంబంధమున్న వ్యక్తులకు డబ్బులు పంపినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో రకుల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. సినిమాల విషయానికొస్తే రకుల్ ప్రస్తుతం వరుస బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ఇటీవలే ఈమె నటించిన థాంక్ గాడ్ రిలీజై ఫ్లాప్‌గా మిగిలింది. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజను సినిమాలున్నాయి. అందులో కమల్ హాసన్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఇండియన్-2 ఒకటి.