టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన సెలెబ్రెటీలకు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన కెల్విన్ సంబంధించి పలు కీలక విషయాలను ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఈమేరకు ఆయన ఛార్జ్ షీట్‌లో అంశాలను కూడా తెలియచేసింది.
ఎక్సైజ్ శాఖ ప్రకారం.. ‘కెల్విన్ మంగళూరులో చదువుకునేటప్పుడు డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు. 2013 నుంచి తన స్నేహితులకు డ్రగ్స్ అమ్మడం మొదలు పెట్టాడు. గోవా, విదేశాల నుండి డార్క్ వెబ్ ద్వారా కెల్విన్ డ్రగ్స్ తెప్పించాడు. వాట్సాప్, మెయిల్ ద్వారా ఇతరుల నుంచి ఆర్డర్లు తీసుకొని డ్రగ్స్ సరఫరా చేశాడు. చిరునామాలు, ఇతర కీలక వివరాలు దర్యాప్తులో కెల్విన్ వెల్లడించలేదు. కెల్విన్, అతని స్నేహితులు నిశ్చయ్, రవికిరణ్ ప్రమేయం ఆధారాలున్నాయి. సోదాల సందర్భంగా కెల్విన్ వంటగది నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు’ అని ఎక్సైజ్ శాఖ పేర్కొంది.
ఛార్జి షీట్ అంశాలు..
2017 జులై 2న కెల్విన్ తో పాటు మరో ఇద్దరు అరెస్ట్ చేశాం.. నిఖిల్ శెట్టి అలియాస్ నిశ్చయి, రవి కిరణ్ లు అరెస్ట్ చేశాము. కెల్విన్ ఇంట్లో సెర్చ్ వారెంట్ టైంలో గొడదుకి పరిపోయేందుకు కెల్విన్ ప్రయత్నం చేశారు. కెల్విన్ బెడ్ రూంలో రెండు కేజీల గాంజాతో పాటు 30 గ్రాముల mdma 650 LSD bolt ల రికవరీ చేశాం.
కెల్విన్ విచారణలో మరో ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్లు రవి, నిఖిల్ ఇళ్లలో ఎక్సైజ్ అధికారుల సోదాలు జరిపారు. కెల్విన్ ఇంట్లో పెన్ డ్రైవ్ సోనీ సిడి లు 3, మొబైల్ ఫోన్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు సెర్చ్ చేసే సమయానికి ల్యాప్ టాప్ లో ఉన్న డేటాను కెల్విన్ మొత్తం ఎరెజ్ చేశారు. జూలై 3 డ్రగ్స్ కేసుపై సిట్ ఏర్పాటు చేశాం. జూలై 15 కెల్విన్ ను ఎక్సైజ్ శాఖ కస్టడీలోకి తీసుకొంది.
2013 నుంచి డ్రగ్స్ బానిసైన కెల్విన్, మంగళారులో చదవుకుంటున్న సమయంలో ప్రెండ్స్ కు అలవాటు చేశాడు. కోడ్ బాషలో ఆర్డర్ తీసుకోంటూ గోవా విదేశాలో నుంచి డ్రగ్స్ దిగుమతి చేసేవాడు. కెల్విన్ ఇచ్చిన సమాచారంతో NDPS act 67 యాక్ట్ ప్రకారం సినితారాలకు నోటీసులు ఇచ్చాము. సిని తారల నమూనాలు ఎక్సైజ్ శాఖ సేకరించింది. నమూనాల రిపోర్ట్ ఆధారంగా FSLP సినీ తారలకు క్లీన్ చిట్ ఇచ్చింది’ అని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.
Read Also: కెల్విన్ నమ్మశక్యంగా లేడు, సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవు: ఎక్సైజ్ శాఖ