టాలీవుడ్ డ్రగ్స్ కేసులో గురువారం ఈడీ ఎదుట నటి చార్మీ హాజరుకానుంది. ఇప్పటికే చార్మికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. చార్మీ గురించి ఈడీకి కెల్విన్ ఎలాంటి విషయాలు అందజేశాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఈడీ చార్మి బ్యాంకు అకౌంట్లను కూడా పరిశీలించనున్నారు. చార్మికి చెందిన ప్రొడక్షన్ హౌస్‌కు సంబంధించిన లావాదేవీలపై కూడా ఈడీ ఆరా తీయబోతోంది. పూరీ జగన్నాధ్‌తో కలిసి సినిమా నిర్మాణంలోకి వచ్చింది చార్మ. కెల్విన్ అకౌంట్లోకి చార్మి పెద్దమొత్తంలో నగదు బదిలీ చేసినట్లు…
ప్రస్తుతం టాలివుడ్ లో డ్రగ్స్ కేసు సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనుమానం ఉన్న సినీ తారలకు ఈడీ సమన్లు పంపింది. నిన్న దర్శకుడు పూరి జగన్నాథ్ ఈడీ ముందు విచారణకు కూడా హాజరయ్యారు. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న కెల్విన్ ఈడీ ముందు అప్రూవర్గా మారినట్లు తెలుస్తుంది. 6 నెలల క్రితం కెల్విన్ పై కేసు నమోదు చేసింది ఈడీ. ఎక్సైజ్ కేసు ఆధారంగా కెల్విన్ పై ఈ కేసు నమోదు చేసింది.…
టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈడీ విచారణను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి 12 మంది సినీ ప్రముఖులను విచారించనుండగా, తొలిరోజున దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈడీ విచారణకి హాజరయ్యారు. ఉదయం 10.17 గంటల నుంచి రాత్రి 7.45 వరకు ఈ విచారణ కొనసాగింది. పూరీని, అతని సీఏను విడివిడిగా ప్రశ్నించారు. పూరీ బ్యాంకు లావాదేవీలపై పూర్తిగా ఈడీ ఆరదీసింది. పూరీకి చెందిన 3 బ్యాంకు అకౌంట్ల నుంచి సమాచారం సేకరించింది. 2015 నుంచి…
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్ నేడు విచారణకు హాజరయ్యారు. 8 గంటలకు పైగా పూరిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. బ్యాంక్ లావాదేవీల పైనే దృష్టి సారించిన ఈడీ.. విదేశీ లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనలపై ఈడీ దర్యాప్తు కొనసాగుతుంది. అయితే తాజాగా నిర్మాత బండ్ల గణేష్ హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు. పూరి-బండ్ల గణేష్ గతంలో కొన్ని సినిమాలకు కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. ఆ బాండింగ్ తోనే…
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్ ను ఉదయం నుంచి 5 గంటలుగా ఈడీ కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతోంది. పూరి జగన్నాథ్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ని అధికారులు పరిశీలిస్తున్నారు. 2015 నుండి అకౌంట్ స్టేట్మెంట్ లను పరిశీలిస్తున్నారు. చార్టెడ్ అకౌంట్ సమక్షంలో ఈడీ అధికారులకు పూరి జగన్నాథ్ వివరిస్తున్నారు. మరిముఖ్యంగా బ్యాంక్ లావాదేవీల పైనే దృష్టి సారించిన ఈడీ.. విదేశీ లావాదేవీలను…
టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దూకుడు పెంచారు. డ్రగ్స్ కేసులో లబ్ధిదారుల ఆస్తుల జప్తు దిశగా ఈడీ దర్యాప్తు చేపట్టనుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 3, 4 ప్రకారం ఈసీఐఆర్ నమోదు చేశారు. ఆబ్కారీ కేసుల ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. విదేశీ అక్రమ లావాదేవీలు గుర్తిస్తే ఫెమా కేసులు నమోదు చేసే యోచనలో వున్నారు. డ్రగ్స్ కేసులో 12 మంది సినీ తారలకు నోటిసులను జారీచేసిన సంగతి…
టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై మరింత లోతుగా విచారణ చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈ కేసులో మనీలాండరింగ్ అభియోగాల కింద అవసరమైతే ఇంటర్పోల్ మద్దతు తీసుకునే ఆలోచనలో ఈడి ఉన్నట్లుగా సమాచారం. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డ్రక్స్ కొనుగోలుపై పునాదులు తవ్వుతోంది ఈడి. ఏ దేశానికి ఎంత మొత్తంలో నిధులు మళ్ళించారనే అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే విచారణకు హాజరు కావాలని 12 మంది సినీ తారలకు ఈడి నోటీసులు పంపిన విషయం తెలిసిందే. వీరిచ్చే సమాచారాన్ని బట్టి…
టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ సెలెబ్రిటీల పేర్లు ఇందులో బయటకు వచ్చాయి. 2017 లోనే ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు రవితేజ, ఛార్మి, రకుల్, రానా, తరుణ్, పూరి జగన్నాథ్, నవదీప్, ముమైత్ ఖాన్, నందు, శ్రీనివాస్ తదితరుల నుంచి శాంపిల్స్ ను సేకరించి డ్రగ్స్ నిర్ధారణ పరీక్ష కోసం ల్యాబ్ కు పంపారు. ఆ తరువాత ఈ కేసులో వేగం తగ్గిపోయింది. తాజాగా ఈడీ సెలెబ్రెటీలకు…