సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో లోతుగా విచారణ జరిపేందుకు సిద్ధం అవుతోంది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. గతంలో ఎక్సైజ్‌శాఖ ఇచ్చిన వివరాలపై అసంతృప్తితో ఉన్న ఈడీ అధికారులు.. తాజాగా, డ్రగ్స్ కేసులో జరిగిన పరిణామాలపై కూడా ఫోకస్ పెడుతోంది.. ఎక్సైజ్ అధికారుల తీరుపై కోర్టులో ఫిర్యాదు చేయనుంది.. అలాగే, డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ అధికారులను కూడా విచారించే యోచనలో ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉన్నట్టుగా తెలుస్తోంది.. డ్రగ్స్ కేసులో ఉన్న టాలీవుడ్ స్టార్స్ కాల్ డేటాను పరిశీలించనున్న ఈడీ.. తాజాగా టోనీ వ్యవహారంలోనూ దృష్టి సారించింది.. ముఖ్యంగా నైజీరియాకు నిధుల మళ్లింపుపై ఫోకస్ పెట్టారు ఈడీ అధికారులు.. వ్యాపారవేత్తలను విచారించే యోచనలో కూడా ఉన్నారు.. వ్యాపారుల ద్వారా హవాలా మార్గంలో నిధులను మళ్లించిన తీరుపై మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.
Read Also: అనంతపురం రోడ్డుప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన