టాలీవుడ్ డ్రగ్స్ కేసు మలుపులు తిరుగుతోంది. ఈడీ కోర్ట్ ధిక్కరణ పిటీషన్ తో ముందు కొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈడీ అడిగిన అన్ని వివరాలు ఇచ్చేసింది ప్రభుత్వం. డిజిటల్ రీకార్డ్స్ ,కాల్ డేటా, ఎఫ్ఎస్ఎల్ నివేదిక లను ఈడీ కి అందించినట్లు తెలిపింది ప్రభుత్వం. ఈడీ అడిగిన వివరాలు ఇచ్చినట్లు హైకోర్టు రిజిస్టర్ కు మెమో దాఖలు చేసింది ప్రభుత్వం.
చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్పరాజ్ అహ్మద్ పై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది ఈడీ. ప్రభుత్వం మెమోతో కోర్టు ధిక్కరణ పిటిషన్ వెనక్కి తీసుకుంది ఈడీ. దీంతో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మళ్ళీ దూకుడు పెంచనుంది ఈడీ. ఈ కేసుకి సంబంధించి మరోసారి సినీ తారలను విచారించనుంది ఈడీ. ప్రభుత్వం , ఎక్సైజ్ శాఖ ఇచ్చిన డిజిటల్ రీకార్డ్స్, కాల్ డేటా ను ఈడీ పరిశోధిస్తోంది. వీటి ఆధారంగా మరోసారి సినీ ప్రముఖులను విచారించనున్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్ లావాదేవీలు, డ్రగ్స్ కొనుగోళ్లు,మనీ ల్యాండరింగ్ అంశాలపై కూపీ లాగనుంది ఈడీ. సినీతారల్ని విచారించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఈడీ. మళ్ళీ విచారణకు తొలుత హాజరయ్యేది ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది.