లెక్కల మాస్టర్ కి ‘లైగర్’ స్పెషల్ విషెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ నేడు తన 52 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఇక నేడు సుకుమార్ బర్త్ డే విషెస్ తో ట్విట్టర్ మారుమ్రోగిపోయింది. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సుకుమార్ కి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇప్పటికే ఆయనాతో కలిసి పనిచేసిన రామ్ చరణ్, అల్లు అర్జున్, రామ్ వంటి హీరోలు లెక్కల మాస్టర్ కి తమదైన రీతిలో శుభాకాంక్షలు తెలుపగా.. ఇకముందు పనిచేసే హీరో విజయ్ దేవరకొండ అంతే స్పెషల్ గా సుకుమార్ కి బర్త్ డే విషెస్ ని తెలిపారు. వీరిద్దరి కాంబోలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప ది రూల్ తర్వాత, సుకుమార్ విజయ్ తో సినిమా మొదలు పెట్టనున్నారు. అప్పటిలోగా విజయ్ లైగర్ షూటింగ్ ని పూర్తి చేయనున్నాడు. ఇక ఈ విషయాన్ని కూడా విజయ్ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు.
“సుకుమార్ సార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం ఉండాలని కోరుకుంటున్నాను. మీతో సినిమా చేయడానికి ఎదురు చూడలేకపోతున్నాను.. 2021 లో ది రైజ్, 2022 లో ది రూల్, 2023 లో ది ర్యాంపేజ్ ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ర్యాంపేజ్ కథతో విజయ్ ని ఏ రేంజ్ లో చూపించనున్నాడో అని అభిమానులు యితఁహో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Also Read
Happy Birthday @aryasukku sir – I wish you the best of health & happiness!
Cannot wait to start the film with you 🙂 love and hugs 🤗🤍
2021 – The Rise
2022 – The Rule
2023 – The Rampage pic.twitter.com/lxNt45NS0o— Vijay Deverakonda (@TheDeverakonda) January 11, 2022
తాజావార్తలు
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
-
Volvo EX90 India Launch: భారత్లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!