టోక్యో ఒలింపిక్స్ ముగిశాయి. ముగింపు వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. 39 స్వర్ణాలతో అమెరికా టాప్ ప్లేసు సాధించింది. ఆ తర్వాతి స్థానాలను చైనా, జపాన్ పొందాయి. భారత్ మొత్తం ఏడు పతకాలతో 48వ స్థానంలో నిలిచింది. అసలు జరుగుతాయా, లేదా అన్న సందిగ్ధత నుంచి ఎన్నో అవాంతరాలను అధిగమించి టోక్యో ఒలింపిక్స్ జరిగాయి. ప్రపంచం మొత్తాన్ని కలవరపెట్టిన కరోనా.. ఒలింపిక్స్‌ను కూడా కమ్మేసింది. చివరికి ఏడాది ఆలస్యంగా జరిగిన టోక్యో ఒలింపిక్స్ ముగిశాయి. ముగింపు వేడుకలను గతంలో…
గేమ్ ఏదైనా.. మనోళ్లు పతకం కొట్టాల్సిందే అనుకుంటాం. గెలిస్తే… భుజాలకెత్తుకుంటాం. ఓడిపోతే.. నేలకేసి కొడతాం. ఇదే మనకు తెలిసిన పద్ధతి. ఆడేవారికి ప్రోత్సాహాన్నిద్దాం అనే ఆలోచన మాత్రం ఉండదు. విజయం సాధించాలనే ఆకాంక్ష ఎంత బలంగా ఉంటుందో.. గెలవడానికి జరిగే కసరత్తులో కనీస ప్రోత్సాహం ఉండదు. అంతర్ జిల్లా పోటీల నుంచి మొదలుకుని.. అంతర్జాతీయ గేమ్స్ వరకు అన్నింట్లో మనవాళ్లు గెలవాలనుకుంటాం. కానీ దానికి ఓ బలమైన వ్యవస్థ ఉండాలనే వాస్తవాన్ని మాత్రం ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తాం. ప్రపంచ…
హాకీ..!! పేరుకే నేషనల్ గేమ్… ఆడేవాళ్లు కరువు. ఆదరణ అసలే ఉండదు. నాలుగేళ్లకోసారి ఒలింపిక్స్ వస్తే కానీ.. గుర్తుకు రాని గేమ్. హాకీ గ్రౌండ్స్ ఉండవు… హాకీ లీగ్స్ జాడలేదు. హాకీ వైపు వచ్చే క్రీడాకారులు ఒకరిద్దరే. వాళ్లూ కొన్ని రోజులే. మనది కాని గేమ్స్‌కి యమ క్రేజ్…!! కానీ జాతీయ క్రీడాను ఎందుకు పట్టించుకోరు. లోపం ఎక్కడుంది..? ఇండియా నేషనల్ గేమ్.. హాకీ..! అవును కదా..? అనుకునే రోజులివి. హాకీ జాతీయ క్రీడ అని కూడా…
టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోలో మొట్టమొదటి సారిగా నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని సాధించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. వందేండ్లుగా స్వర్ణ పతకం కోసం ఎదురు చూస్తున్న భారతీయుల కలలను నీరజ్ చోప్రా నిజం చేశారని సీఎం కేసీఆర్ అభినందించారు. నీరజ్ చోప్రా విజయం భారతదేశంలోని క్రీడాకారులందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్న ముఖ్యమంత్రి.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరుస్తుండటం సంతోషకరమైన విషయమన్నారు.…
ఒలింపిక్స్‌లో పతకం సాధించిన హాకీ ప్లేయర్లకు…రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా నగదు బహుమతి ప్రకటిస్తున్నాయ్. పంజాబ్ సర్కార్ కోటి రూపాయలు ప్రకటిస్తే…హర్యానా రెండున్నర కోట్లు ఇస్తామని వెల్లడించింది. తామేమీ తక్కువ కాదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సైతం…ఒక్కో ప్లేయర్ కోటి ఇస్తామన్నారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన హాకీ క్రీడాకారులకు…రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా నగదు నజారానాలు ప్రకటిస్తున్నారు. ఒక ప్రభుత్వం కోటి రూపాయలు ఇస్తామంటే…మరో ప్రభుత్వం రెండు కోట్లు ప్రకటించింది. జట్టు సభ్యులందరికి కాదు…కేవలం ఆయా రాష్ట్ర క్రీడాకారులకు మాత్రమేనని చెబుతున్నాయ్.…
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మొదటి బంగారు పథకం వచ్చింది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా పసిడి పథకం సాధించాడు. అయితే ఒలింపిక్స్ చరిత్రలో అథ్లెటిక్స్ లో తొలి మెడల్ సాధించిన ఆటగాడిగా నీరజ్ చోప్రా రికార్డు సృష్టించాడు. అభినవ్ బింద్రా తర్వాత వ్యక్తిగత విభాగంలో ద్వారణం సాధించిన రెండో భారతీయుడిగా నిలిచాడు నీరజ్. అయితే ఈ పథకం తో భారత్ ఖాతాలోకి మొత్తం 7 పథకాలు వచ్చాయి. అయితే ఒలింపిక్స్ లో భారత్ కు…
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలోకి మరో పథకం వచ్చి చేరింది. రెజ్లింగ్ లో భజరంగ్ పూనియా కాంస్యం సాధించాడు. రెజ్లింగ్ పురుషుల 65 కిలోల విభాగంలో ఈ పథకం కైవసం చేసుకున్నాడు. అయితే సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయిన భజరంగ్ నేడు కాంస్య పథకం మ్యాచ్ లో కజికిస్థాన్ కు చెందిన జైకోవ్ పై ఘన విజయం సాధించాడు. జైకోవ్ పై భజరంగ్ 8-0 తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే దీంతో…
ఒలింపిక్స్‌లో యువ గోల్ఫర్ అదితి అశోక్…అద్భుత ప్రదర్శన చేసింది. ఒకే ఒక్క స్ట్రోక్‌తో పతకాన్ని అందుకునే ఛాన్స్ మిస్సయింది. అంచనాలకు మించి రాణించిందంటూ…ప్రముఖులు కీర్తిస్తున్నారు. ఒక్క బర్డీ అదితికి కలిసొచ్చి ఉంటే…ఆమె సరికొత్త చరిత్ర సృష్టించేది. పోడియం ఎక్కలేకపోయినందుకు బాధగా ఉందని వాపోయింది అదితి. భారత గోల్ఫర్, యువ క్రీడాకారిణి అదితి అశోక్‌కు ఒలింపిక్స్‌లో…తృటిలో మెడల్ మిస్సయింది. తొలి నుంచి అద్భుత ప్రదర్శన చేసిన అదితి…చివరి రౌండ్‌లో తడబడింది. దీంతో పతకం అందుకునే అవకాశాన్ని కోల్పోయింది. గోల్ఫ్…