అనుమతి లేకుండా పీవీ సింధు ఫోటో ఉపయోగించినందుకు 20 కి పైగా బ్రాండ్‌లకు నోటీసులు పంపింది బేస్ లైన్ వెంచర్స్. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని సాధించిన సింధు ఇమేజ్‌ని వాడుకున్నట్లు ఆరోపణలు చేసారు. పలు బ్రాండ్లు ఒలింపిక్స్ మార్గదర్శకాలను కూడా ఉల్లంఘించారని ఆరోపించింది. నిబంధనలను ఉల్లంఘించిన ప్రతి బ్రాండ్ నుండి 5 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని కోరుతూ లీగల్ నోటీస్ పంపారు. అధికారికంగా, IOC భాగస్వాములైన బ్రాండ్‌లు మాత్రమే, ఈ ఫోటోలు ఉపయోగించడానికి అనుమతించబడతాయి.…
టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ భజరంగ్ పునియా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లాడు.. రెజ్లింగ్ 65 కిలోల విభాగంలో క్వార్టర్స్‌లో విజయం సాధించారు.. క్వార్టర్ ఫైనల్‌లో ఇరాన్‌కు చెందిన గియాసి చెకా మోర్తజాను 2-1 తేడాతో ఓడించాడు.. కేవలం 4:46 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించాడు భజరంగ్ పునియా.. ఇక సెమీ ఫైనల్‌లో అజర్ బైజాన్‌కు చెందిన అలియెవ్ హజీతో తలపడనున్నాడు భజరంగ్ పునియా.. సెమీస్ విజయం సాధిస్తే ఏదో ఒక మెడల్ ఖాయంగా భారత్‌కు అందించనున్నాడు భజరంగ్.. లేదంటే…
భారతదేశానికి 41 ఏళ్ల తర్వాత ఒలంపిక్స్ లో హాకీలో పతకం రావడం పట్ల మన తారలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పతకం గెలిచి దేశ ప్రతిష్టను పెంచిన హాకీజట్టుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు నందమూరి బాలకృష్ణ. హాకీ జట్టు కఠోర శ్రమతోనే పతకం లభించింది. దేశ ప్రజల ఆశీస్సులు, మన్ననలు క్రీడా కారులకు ఎల్లవేళలా వుంటాయి. దేశం గర్వించేలా ఒలంపిక్స్ లో క్రీడాకారులు పోరాడుతున్నారు. ఒలంపిక్స్ లో ఇతర క్రీడాకారులు కూడా మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను…
ఎలాగైనా స్వర్ణం గెలవాలని టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగిన భారత పురుషుల హాకీ జట్టు సెమీస్‌తో ప్రపంచ ఛాంపియన్ బెల్జియం చేతిలో ఒటమిపాలైన సంగతి తెలిసిందే. కాగా, ఈరోజు కాంస్యపతకం పోరులో భారత జట్టు జర్మనీతో తలపడింది. నాలుగు క్వార్టర్ లుగా సాగిన గేమ్ హోరాహోరీగా సాగింది. రెండు క్వార్టర్‌లు ముగిసే సరికి 3-3 గోల్స్‌తో సమంగా ఉన్నాయి. అయితే, మూడో క్వార్టర్ లో ఇండియా లీడ్ సాధించి రెండు గోల్స్ చేసి 5-3 ఆధిక్యాన్ని సాధించింది.…
టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్లు ఆశలు రేపుతున్నారు. 53 కేజీల మహిళా విభాగంలో ఇండియా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఒలింపిక్స్‌లో శుభారంభం చేశారు. స్వీడన్‌కు చెందిన మ్యాట్‌సన్‌ను 7-1 తేడాతో ఓడించారు. ఈ మ్యాచ్‌లో ఆదినుంచి ఫొగాట్ ఆదిపత్యం సాధించింది. వీలైనంత వరకూ దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థిని మట్టికరిపించింది. మొదటి పిరియడ్‌లో 2,2,1 స్కోర్ సాధించిన ఫొగాట్, రెండో పీరియడ్‌లో 2 స్కోర్ మాత్రమే చేసింది. అయితే, స్వీడన్ క్రీడాకారిణి ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క పాయంట్…
ఒలింపిక్స్‌లో భారత్ మరో పతకం సాధించింది. మహిళల బాక్సింగ్ కేటగిరి లవ్లీనా బొర్గొహెయిన్ కాంస్యపతకం సాధించింది. సెమీస్‌లో లవ్లీనా టర్కీకి చెందిన ప్రపంచ చాంపియన్ సుర్మెనెలి చేతిలో ఓటమిపాలైంది. మొత్తం 5 రౌండ్లలోకూడా సుర్మెనెలి ఆదిపత్యం కొనసాగించింది. దీంతో సుర్మెనెలి లవ్లీనాపై 5-0 తేడాతో విజయం సాధించింది. ఎలాగైన ప్రపంచ బాక్సర్‌పై విజయం సాధించి స్వర్ణం గెలవాలని చూసిన లవ్లీనాకు సెమీస్‌లో ఎదురుదెబ్బ తగలడంతో కాస్యంతో సరిపెట్టుకోవాలసి వచ్చింది. ఇప్పటికే ఇండియా వెయిట్ లిఫ్టింగ్‌లో చాను రజతం,…
టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. గత ఒలింపిక్స్‌లో కంటే ఈసారి మన ఆటగాళ్లు రాణిస్తున్నారని చెప్పొచ్చు. 1980లో రష్యాలో జరిగిన మాస్కో ఒలింపిక్స్ తరువాత 2021లో జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు సెమీస్‌కు చేరుకుంది. సెమీస్ లో ఓడిపోయినప్పటికీ మంచి ఆటను ప్రదర్శించి భవిష్యత్తులో జాతీయ క్రీడకు తిరిగి పునర్వైభవం రానుందని చెప్పకనే చెప్పారు. ఇక, మహిళల హాకీ జట్టు సెమీస్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు…
భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతోంది. ఒలింపిక్స్ హాకీలో… క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో… ఆస్ట్రేలియాను ఓడించి… సంచలనం సృష్టించింది. మూడుసార్లు ఒలింపిక్ విజేత ఆస్ట్రేలియాను మట్టి కరిపించి… సెమీస్‌కు సిద్ధమైంది రాణి రాంపాల్ సేన. పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును క్వార్టర్స్‌లో ఓడించడంతో… మహిళల హాకీ జట్టుపై అందరికీ అంచనాలు పెరిగాయి. సెమీస్‌లోనూ అర్జెంటీనా జట్టును ఓడించి… ఫైనల్‌కు దూసుకెళ్లేందుకు వ్యూహాలు రచిస్తోంది. క్రీడాకారులందరూ సమష్టిగా రాణిస్తుండటంతో… రాంపాల్ సేనపై మరింత విశ్వాసం పెరిగింది.…