టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలోకి మరో పథకం వచ్చి చేరింది. రెజ్లింగ్ లో భజరంగ్ పూనియా కాంస్యం సాధించాడు. రెజ్లింగ్ పురుషుల 65 కిలోల విభాగంలో ఈ పథకం కైవసం చేసుకున్నాడు. అయితే సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయిన భజరంగ్ నేడు కాంస్య పథకం మ్యాచ్ లో కజికిస్థాన్ కు చెందిన జైకోవ్ పై ఘన విజయం సాధించాడు. జైకోవ్ పై భజరంగ్ 8-0 తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే దీంతో కలిపి టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు ఇప్పటివరకు 6 పథకాలు వచ్చాయి. మొత్తం ఆరులో రెండు రజతాలు కాగా నాలుగు కాంస్యాలు. ఇక ఈరోజు మరో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్ లో పోటీపడనున్నాడు.