టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన సింధూ.. కోచ్‌ను మార్చడంపై తాజాగా మరోసారి స్పష్టతనిచ్చింది. ఏడాదిన్నరగా పార్క్ శిక్షణ ఇస్తున్నాడనీ… భవిష్యత్తులోనూ అతని ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగిస్తాననీ తేల్చి చెప్పింది. గోపీచంద్ అకాడమీని వీడి గచ్చిబౌలి స్టేడియంలో సాధన చేయడంలో వివాదమేమీ లేదన్న సింధూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులో ఉన్న స్టేడియం వసతుల్ని ఉపయోగించుకున్నానని చెప్పింది. ఫిబ్రవరి నుంచి అక్కడే సాధన చేస్తున్నాననీ… ఆ స్టేడియంలో ఆడటం టోక్యోలో ఎంతగానో ఉపయోగపడిందని తెలిపింది సింధు. టోక్యోలో కాంస్యం గెలిచాక…
ఒలింపిక్స్ లో భారత్ చరిత్ర ఎప్పుడూ తీసికట్టే. మనతో ఎందులోనూ సరితూగని దేశాలు కూడా విశ్వ క్రీడా వేదికపై తలెత్తుకుని సగర్వంగా నిలబడుతుంటే.. ఇండియా మాత్రం పతకాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడాల్సిన దుస్థితి. అడపాదడపా సాధించే విజయాలను అపురూపంగా కళ్లకద్దుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు టోక్యోలో కూడా మహిళలే భారత్ పరువు నిలబెట్టారు. టోక్యో ఒలింపిక్స్ తొలిరోజే వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను రజతం గెల్చింది. దేశ చరిత్రలో ఒలింపిక్స్ తొలిరోజే పతకం రావడం…
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధుకు ఏపీ నగదు బహుమానం ప్రకటించింది. ఒలింపిక్స్ సహా అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో ప్రతిభ చాటుకున్న రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు అందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేసారు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించిందన్న సీఎం… ఈ విజయాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతిభ చాటుతున్న రాష్ట్ర క్రీడాకారులందరికీ కూడా ప్రభుత్వం తగిన రీతిలో ప్రోత్సహిస్తుందన్నారు సీఎం. పీవీ సింధుకు ఇటీవలే…
టోక్యో ఒలింపిక్స్‌లో సంచలనాలు నమోదు చేసిన హాకీ పురుషుల జట్టు సెమీస్‌లో పరాజయం పాలైంది. వరల్డ్ ఢిపెండింగ్ చాంపియన్ బెల్జియం చేతిలో 5-2 తేడాతో ఓడిపోయింది. మొదటి క్వార్టర్‌లో 2-1 తేడాతో లీడ్‌లో ఉన్న ఇండియా సెకండ్ క్వార్టర్‌లో సంచలనాలు చేయలేకపోయింది. అటు బెల్జియం జట్టు తనదైన శైలిలో విజృంభించి మరో గోల్ చేయడంతో సెకండ్ క్వార్టర్ 2-2తో సమం అయింది. అయితే, మూడో క్వార్టర్‌లో ఎవరూ ఎలాంటి గోల్ చేయలేదు. కానీ నాలుగో క్వార్టర్‌లో బెల్జియం…
టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు దూసుకుపోతున్నది. నిన్నటి రోజున పురుషుల హాకీ జట్టు బ్రిటన్‌ను ఓడించి సెమీస్‌కు చేరుకున్నది. 3-1తేడాతో బ్రిటన్‌ను ఓడించి సెమీస్‌లో బెల్జియంతో తలపడేందుకు సిద్ధమైంది. కాగా, అదే బాటలో ఇప్పుడు మహిళల హాకీ టీమ్ కూడా పయనిస్తోంది. మహిళల హాకీ టీమ్ బలమైన ఆస్ట్రేలియాపై 1-0 తేడాతో ఓడించి సెమీస్ కు చేరుకున్నది. మొదటి క్వార్టర్‌లో ఏ జట్టు కూడా గోల్ చేయలేదు. రెండో క్వార్టర్ 22 వ నిమిషం వద్ద…
ఒలింపిక్స్‌లో బాక్సింగ్ విభాగంలో పతకం ఖాయం అనే రీతిలో ఆశలు రేపిన భారత బాక్సర్ సతీష్ కుమార్ నిరాశపర్చాడు.. పతకానికి మరో అడుగు దూరంలోనే తన పోరాటాన్ని ముగించాడు.. 91 కిలోల సూపర్ హెవీ వెయిట్ కేటగిరీలో ఇవాళ జరిగిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో ఉజ్బెకిస్థాన్ బాక్సర్, వరల్డ్ నంబర్ వన్ జలలోవ్ బఖోదిర్ తో తలపడిన సతీష్‌కుమార్.. 0-5తో ఓటమిపాలయ్యారు.. తొలి రౌండ్ నుంచే సతీష్‌పై పూర్తిగా పైచేయి సాధించారు జలలోవ్… ప్రతి రౌండ్‌లోనూ జడ్జీలు జలలోవ్…
టోక్యోలో జరుగుతున్న ఒలంపిక్స్ లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్ లో చైనా కి చెందిన వరల్డ్ నెంబర్ వన్ తైజుయింగ్ చేతిలో ఓడిపోయింది. మ్యాచ్ ప్రారంభ సమయం నుండి తీవ్ర ఒత్తిడిలో ఆడింది సింధూ. ఔట్ ఆఫ్ ది లైన్ కొడుతూ… పాయింట్స్ ను చేజార్చుకుంది. దాంతో పీవీ సింధుకు 18-21,12-21 తో వరుస సెట్లలో ఓడిపోయింది. ఇక గత ఒలింపిక్స్ లో సింధూ చేతిలో ఒడిన తైపీ…
టోక్యో ఒలింపిక్స్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది తెలుగు తేజం పీవీ సింధు… శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి, నాలుగో సీడ్ అకానా యమగూచిపై విజయం సాధించి సెమీస్‌లో ప్రవేశించారు.. తద్వారా ఓ అరుదైన రికార్డును కూడా సాధించగారు.. వరుసగా రెండుసార్లు ఒలిపింక్స్‌లో సెమీ ఫైనల్ చేరిన తొలి భారత క్రీడాకారిణి, షట్లర్‌గా పీవీ సింధు రికార్డు సృష్టించారు.. అయితే, ఇవాళ జరగనున్న సెమీస్ సింధుకు కఠిన సవాల్ గా చెప్పాలి.. ఎందుకుంటే వరల్డ్ నెంబర్…
టోక్యో ఒలంపిక్స్ లో భారత క్రీడాకారిణి పీవీ సింధూ జైత్రయాత్ర కొనసాగుతుంది. నేడు బ్యాడ్మింటన్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో జపాన్ ప్లేయర్ యమగూచీపై విజయం సాధించి సెమీస్ లో అడుగు పెట్టింది పీవీ సింధూ. అయితే మ్యాచ్ ప్రారంభ సమయం నుండి జపాన్ ప్లేయర్ పైన తన ఆధిపత్యం చూపిస్తూ వచ్చింది. వరసగా రెండు సెట్లు 21- 13, 22-20 తో కైవసం చేసుకున్న పీవీ సింధూ విజయాన్ని ఖాతాలో వేసుకొని ఫైనల్ 4 లోకి ఎంట్రీ…