ఒలింపిక్స్‌లో భారత్ అథ్లెట్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించారడు. జావెలింగ్ త్రో విభాగంలో భారత్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. వందేళ్ల చరిత్రలో ఇండియాకు తొలిసారి స్వర్ణపతకం లభించింది. జావెలింగ్ త్రో విభాగంలో భారత్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన నీరజ్ చోప్రాకు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర అదిరిపోయే కానుకను అందించేందుకు సిద్ధం అయ్యారు. మహీంద్రా కంపెనీకి చెందిన ఎక్స్‌యూవీ 700 వాహనాన్ని కానుకగా అందిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. త్వరలోనే మహీంద్రా కంపెనీ ఎక్స్‌యూవీ 700 వాహనాన్ని మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నది. మార్కెట్‌లోకి తీసుకొచ్చిన వెంటనే నీరజ్ చోప్రాకు మహీంద్రా కంపెనీ వాహనాన్ని అందజేయనున్నది. ఇండియా ఇప్పటి వరకు టోక్యో ఒలింపిక్స్‌లో 7 పతకాలు సాధించి పతకాల లిస్ట్ లో 47 వ స్థానంలో నిలిచింది. ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలను సాధించింది ఇండియా.
Read: “ఎస్ఆర్ కళ్యాణమండపం” ఫస్ట్ డే కలెక్షన్స్