Telangana and Four other rich States: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి 6 నెలల్లో దేశవ్యాప్తంగా రిజిస్టరైన మొత్తం కార్లు మరియు SUVల్లో దాదాపు 38 శాతం తెలంగాణ సహా 5 సంపన్న రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. దేశం మొత్తమ్మీద 14 లక్షల కార్లు మరియు SUVలు రిజిస్టర్ కాగా అందులో 5 లక్షల 4 వేల వాహనాలు ఢిల్లీ, కర్ణాటక, హర్యానా, తెలంగాణ, గుజరాత్‌లలోనే నమోదయ్యాయి. ఒడిశా, అస్సాం, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి 5…
ESIC to expand: ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పరిధి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 598 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ESICని 750 జిల్లాలకు విస్తరించనున్నట్లు కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ESIC పథకం కింద ఇప్పుడు 3 కోట్ల 90 లక్షల కుటుంబాలు, 12 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. ESICని భవన నిర్మాణ రంగానికి కూడా విస్తరింపజేస్తామని…
Samsung SmartPhones Sales: ఆన్‌లైన్ ఫెస్టివ్ సేల్స్‌లో మొదటి రోజే శామ్‌సంగ్‌కి సంబంధించి కోటి రూపాయలకు పైగా విలువైన స్మార్ట్‌ఫోన్ల సేల్స్ జరిగాయి. అమేజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా ఈ అమ్మకాలు జరిగినట్లు శామ్‌సంగ్ ఇండియా వెల్లడించింది. 12 లక్షలకు పైగా గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లను విక్రయించామని తెలిపింది. పండుగ సీజన్ నేపథ్యంలో శామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్ల రేట్లను 17 శాతం నుంచి 60 శాతం వరకు తగ్గించింది.
UPI Lite: యూపీఐ పేమెంట్లు చెయ్యాలంటే మొబైల్‌లో డేటా ఉండాలి. దీంతోపాటు పిన్ కూడా తెలిసుండాలి. కానీ.. ఈ రెండూ లేకపోయినా పేమెంట్ చేసేందుకు లేటెస్ట్‌గా ‘యూపీఐ లైట్’ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ రీసెంట్‌గా ప్రారంభించారు. యూపీఐ లైట్ ద్వారా గరిష్టంగా 200 రూపాయలు చెల్లించొచ్చు. ముందుగా బ్యాంక్ అకౌంట్ నుంచి యూపీఐ లైట్ వ్యాలెట్‌లోకి అమౌంట్‌ను డిపాజిట్ చేసుకోవాలి. ఈ బ్యాలెన్స్ 2 వేల రూపాయలకు మించకూడదు.
Funds for Bhanzu: హైదరాబాద్‌కి చెందిన ఇంటర్నేషనల్ మ్యాథ్స్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ భాన్జుకి 115 కోట్ల రూపాయల నిధులు సమకూరాయి. ప్రపంచంలోనే ఫాస్ట్‌గా లెక్కలు చేసే హ్యూమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ భాను ఈ సంస్థను తన పేరిటే భాన్జుగా ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. టెక్నాలజీకి సంబంధించిన మౌలిక సదుపాయాలను మరియు మ్యాథ్స్ కరికులమ్‌లను ఇంకా డెవలప్ చేసేందుకు ఈ ఫండ్స్‌ను వినియోగిస్తామని సంస్థ సీఈఓగా కూడా వ్యవహరిస్తున్న నీలకంఠ భాను తెలిపారు.
Early Diwali to India: మన దేశానికి ఈ ఏడాది దీపావళి పండుగ ముందే రానుందని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ అన్నారు. భారత్-బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల ఇరు దేశాలకూ ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. మరీ ముఖ్యంగా ఇండియాకి లెదర్, టెక్స్‌టైల్, జ్యులరీ, ప్రాసెస్డ్ ఆగ్రో ప్రొడక్ట్స్ వంటి రంగాల్లో ఎగుమతులు ఊపందుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
RBI Orders: 10 వేల కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు కలిగిన అర్బన్ కోపరేటివ్ బ్యాంకులు వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నాటికి చీఫ్ కాంప్లియెన్స్ ఆఫీసర్లను నియమించాలని రిజర్వ్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. టయర్-4 ఎంటిటీస్‌గా వర్గీకరించిన ఈ బ్యాంకుల్లో కార్పొరేట్ గవర్నెన్స్‌ను మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయాన్ని అమలుచేయాలని సూచించింది.
Key Treatment For Knee Problems: ముసలితనంలో వచ్చే కీళ్ల వ్యాధికి కీలకమైన చికిత్స అందుబాటులోకి వస్తోంది. దేశంలోనే తొలిసారిగా ‘ఆఫ్ ది సెల్ఫ్’ సెల్ థెరపీ ట్రీట్మెంట్‌కు రంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పేషెంట్‌కి ఇచ్చే ఒక్క ఇన్జెక్షన్ ఖరీదే లక్షా పాతిక వేల రూపాయలు కావటం గమనించాల్సిన విషయం. ఈ మెడిసిన్ ప్రభావం రెండేళ్ల కన్నా ఎక్కువే ఉంటుంది.
Local Languages in Public Sector Banks: బ్యాంక్ ఉద్యోగులు స్థానిక భాషలను ఎందుకు నేర్చుకోలేకపోతున్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. లోకల్ లాంగ్వేజ్‌ల్లో మాట్లాడలేని సిబ్బందిని కస్టమర్ ఫేసింగ్ జాబుల్లో కూర్చోబెట్టొద్దని సూచించారు. సౌతిండియాలోని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల ఉద్యోగులు ప్రజలను హిందీలో మాట్లాడాలని అడుగుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Huge Orders to Hyderabad Company: హైదరాబాద్‌లోని MTAR Technologies కంపెనీకి 540 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు వచ్చాయి. ఈ సంస్థ సివిలియన్ న్యూక్లియర్, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, స్పేస్, బాల్ స్క్రూలు మరియు రోలర్ స్క్రూలు, మెరైన్ తదితర సెగ్మెంట్లతోపాటు పర్యావరణ అనుకూల ఇంధన విభాగంలో సేవలందిస్తోంది. క్లీన్ ఎనర్జీకి సంబంధించి పెద్ద సంఖ్యలో కొత్త ఆర్డర్లు లభించటంతో రానున్న రోజుల్లో ఈ సెక్టార్‌లో విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తోంది.