Home
Todays Updates
Todays Updates News
-
‘Note’ these points: పెద్ద నోట్ల రద్దుతో ఒరిగిందేం లేదన్నారుగా? ఆషిమా గోయెల్ ఏం చెప్పారో విన్నారా?
‘Note’ these points: దాదాపు ఆరేళ్ల కిందట పెద్ద నోట్లను రద్దు చేయటం వల్ల కలుగుతున్న ప్రయోజనాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ సభ్యురాలు ఆషిమా గోయెల్ అన్నారు. పన్నుల వసూళ్లు పెరగటానికి ఈ నిర్ణయం పరోక్షంగా దోహదపడిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇండియన్ ఎకానమీ.. డిజిటల్ బాటలో శరవేగంగా పయనిస్తోందని చెప్పారు. -
Laurus Labs Paediatric HIV Treatment: పిల్లల్లో హెచ్ఐవీ చికిత్సకు లారస్ ల్యాబ్స్ Novel Delivery
Laurus Labs Paediatric HIV treatment: హైదరాబాద్‌కి చెందిన లారస్ ల్యాబ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం ఫలితాలను వెల్లడించింది. జులై, ఆగస్టు, సెప్టెంబర్.. ఈ మూడు నెలల్లో కలిపి 234 కోట్ల రూపాయల లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో ఈ సంస్థ లాభం 204 కోట్లు మాత్రమే కావటం గమనించాల్సిన విషయం. దీన్నిబట్టి ఈసారి నికరంగా 15 శాతం ఎక్కువ ప్రాఫిట్‌ను ఆర్జించింది. -
Business Today: Today Business Headlines 19-10-22
Business Today: ఏపీలో బంగారం తవ్వకాల దిశగా..: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో బంగారం తవ్వకాల దిశగా ఎప్పుడో విజయవంతంగా తొలి అడుగు వేసిన ఎన్‌ఎండీసీ.. ఇప్పుడు రెండో అడుగు కూడా ముందుకేసింది. మైనింగ్ లైసెన్స్ పొందేందుకు కన్సల్టెంట్ నియామకానికి తాజాగా తెర తీసింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. లైసెన్స్ లభిస్తే నాలుగేళ్ల నిరీక్షణ ఫలించినట్లవుతుంది. -
GodFather-Bisleri: బిస్లెరీ వాటర్ బాటిళ్ల పైన ‘గాడ్‌ఫాదర్’ బొమ్మ
GodFather-Bisleri: మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమా రీసెంట్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బిస్లెరీ వాటర్ బాటిళ్లపై ఆ మూవీ బొమ్మతో ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు సూపర్‌గుడ్ ఫిల్మ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బిస్లెరీ ప్రతినిధి తుషార్ మల్హోత్రా చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పరిమిత సంఖ్యలో వాటర్ బాటిళ్లపై గాడ్‌ఫాదర్ బొమ్మ గల లేబుళ్లను అతికించి అందుబాటులో ఉంచనున్నారు. -
Global Capability Centres: హైదరాబాద్ అవుతోంది ‘గ్లోబల్’. అదీ.. ఈ సిటీ ‘క్యాపబిలిటీ’ అంటే
Global Capability Centres: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్.. విశ్వ నగరంగా ఎదుగుతోందనటానికి మరో చక్కని ఉదాహరణ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు. ఈ సెంటర్లకు భాగ్య నగరం కేంద్రంగా మారుతోంది. ఈ మేరకు పలు బహుళజాతి సంస్థలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్ల కోసం కంపెనీలు ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల నిర్వహణను ఎంతో కీలకంగా భావిస్తున్నాయి. -
Gold Supplying Banks: భారత్‌కు బంగారం బంద్. అందుకే రేట్లు పెరిగాయా?
Gold Supplying Banks: గోల్డ్ సప్లై బ్యాంక్‌లు ఇండియాకి షిప్‌మెంట్లను తగ్గించాయి. మన దేశానికి బదులుగా చైనా, టర్కీ మరియు ఇతర మార్కెట్లకు బంగరాన్ని తరలించాయి. ఇండియాలో దసరా, దీపావళి వంటి పెద్ద పండుగలున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మన కన్నా ఆయా దేశాల్లోనే బెటర్ ప్రీమియమ్ ఆఫర్లు ఉండటంతో అటు వైపు ఫోకస్ పెట్టాయి. దీంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గోల్డ్ మార్కెట్ అయిన ఇండియాలో బంగారం కొరత నెలకొననుంది. -
Union Nari Shakti Scheme: మహిళా పారిశ్రామికవేత్తలకు వెయ్యి కోట్లకు పైగా రుణాలు
Union Nari Shakti Scheme: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. యూనియన్ నారీ శక్తి పథకంలో భాగంగా మహిళా పారిశ్రామికవేత్తలకు వెయ్యి కోట్లకు పైగా రుణాలను మంజూరుచేసింది. దేశం మొత్తమ్మీద 10 వేల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 2 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు లోన్లు ఇచ్చింది. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు మరియు వాళ్ల అవసరాలను బట్టి లోన్ అమౌంట్‌ను నిర్ణయిస్తున్నామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ మినోచి… -
Wind Man of India: ‘విండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ తుల్సి తంతి ఇకలేరు
Wind Man of India: సుజ్లాన్ ఎనర్జీ అనే సంస్థకు ఫౌండర్‌గానే కాకుండా ‘విండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా కూడా పేరొందిన తుల్సి తంతి కన్నుమూశారు. మన దేశంలోని పవన విద్యుత్ వ్యాపార దిగ్గజాల్లో ఈయన కూడా ఒకరు కావటం చెప్పుకోదగ్గ విషయం. తుల్సి తంతి క్లీన్ ఎనర్జీ సెక్టార్‌లో సైతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందటం విశేషం. సుజ్లాన్ ఎనర్జీ కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ 8 వేల 5 వందల 35 కోట్ల రూపాయలకు పైగా… -
Hero Ramcharan for Hero Company: హీరో విత్ ‘హీరో’. కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్‌చరణ్
Hero Ramcharan for Hero Company: హీరో మోటోకార్ప్ సంస్థ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ నటుడు రాంచరణ్‌తేజ్‌ని నియమించుకుంది. గ్లామర్ ఎక్స్‌టెక్ అనే మోడల్‌కి ఆయన ప్రచారం చేస్తారు. బైక్ స్టైల్, సేఫ్టీ మరియు పెర్ఫార్మెన్స్‌కి హీరో రాంచరణ్ సింబాలిక్‌గా నిలుస్తారని హీరో మోటోకార్ప్ పేర్కొంది. ఇదిలాఉండగా.. హీరో కంపెనీతో కలిసి పనిచేయనుండటం, గ్లామర్ ఎక్స్‌టెక్ గురించి తన ద్వారా మరింత మందికి తెలియనుండటం పట్ల రాంచరణ్‌తేజ్ సంతోషం వ్యక్తం చేశారు. -
SAIL Entered Trillion Club: లక్ష కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన కంపెనీల క్లబ్‌లోకి తొలిసారిగా ‘సెయిల్’
SAIL Entered Trillion Club: లక్ష కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ కలిగిన ఎలైట్ క్లబ్ ఆఫ్ ఇండియన్ కంపెనీస్ జాబితాలోకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా తొలిసారిగా చేరింది. 2021-22 మధ్య కాలంలో 18.73 మిలియన్ టన్నుల హాట్ మెటల్‌ని మరియు 17.36 మిలియన్ టన్నుల క్రూడ్ స్టీల్‌ని ఉత్పత్తి చేసింది. ఈ సంస్థకు సంబంధించి ఇదే ఇప్పటివరకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ కావటం గమనించాల్సిన అంశం.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!